న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'నైపుణ్యాలపై దృష్టి పెడుతాం.. మ్యాచ్‌లు ఆడటాన్ని ఆస్వాదిస్తాం'

Harmanpreet Kaur says Focus on skills, not pressure

ముంబై: ఒత్తిడిపై కాకుండా నైపుణ్యాలపై దృష్టి పెడుతాం అని భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ పేర్కొంది. పెద్ద టోర్నీల్లో ఆడేటపుడు ఎదురయ్యే ఒత్తిడిని దరిచేరకుండా చూసుకుంటేనే ఫలితాలు సాధించవచ్చు. ఒత్తిడి లేకుండా చూసుకుంటాం, మ్యాచ్‌లు ఆడటాన్ని ఆస్వాదిస్తాం అని హర్మన్‌ప్రీత్‌ పేర్కొంది. ఆ్రస్టేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు బయల్దేరే ముందు హర్మన్‌ప్రీత్‌ మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా స్పందించింది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. కీపర్‌గా రాహుల్.. ఆరుగురు బౌలర్లతో బరిలోకిటాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. కీపర్‌గా రాహుల్.. ఆరుగురు బౌలర్లతో బరిలోకి

ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్‌ జరుగుతుంది. అయితే అంతకంటే ముందు భారత్, న్యూజిలాండ్, ఆ్రస్టేలియాలు సన్నాహకంగా ముక్కోణపు టోర్నీని ఆడతాయి. ఈ టోర్నీ కోసమే ముందుగానే భారత్ గురువారం ఆ్రస్టేలియాకు బయలుదేరింది. ఈ సందర్భంగా హర్మన్‌ప్రీత్‌ మాట్లాడుతూ... 'భారత జట్టు గత రెండు ప్రపంచకప్‌లకు దగ్గరగా వెళ్ళింది. కానీ.. ఒత్తిడిని ఎదుర్కోవడంలో విఫలమై ట్రోఫీని చేజార్చుకున్నాం. ఇప్పుడు మాత్రం అలా జరగనివ్వం. పెద్ద టోర్నీ అనే సంగతి పక్కనబెట్టి మ్యాచ్‌లు ఆడటాన్ని ఆస్వాదిస్తాం. ఒత్తిడి లేకుండా చూసుకుంటాం' అని తెలిపింది.

'టీ20 ప్రపంచకప్‌లో ఓపెనర్లు స్మృతి మంధానా, షఫాలీ వర్మల పాత్ర చాలా కీలకం. వాళ్లిద్దరు శుభారంభమిస్తే జట్టు గెలుపొందడం సులభమవుతుంది. నేను కూడా పరుగులు చేయాల్సి ఉంది. ఏడాది నాప్రదర్శనను మెరుగుపర్చుకుంటా. ముక్కోణపు టోర్నీతో అందరం గాడిలో పడతాం. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్నాం. ప్రస్తుతం జట్టు సమతూకంగా ఉంది' అని హర్మన్‌ప్రీత్‌ పేర్కొంది. గత టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌లో ఓడిన భారత మహిళల జట్టు.. వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్లో ఓడిపోయింది.

30 ఏళ్ల హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ గతేడాది రాణించలేకపోయింది. గత కొన్ని నెలలుగా హర్మన్‌ప్రీత్ బ్యాటింగ్ చెప్పుకునే రీతిలో సాగలేదు. 2019లో ఆడిన 11 మ్యాచ్‌లలో ఆమె సగటు 19 మాత్రమే. 2018లో సగటు 41.43గా ఉంది. హర్మన్‌ప్రీత్ చివరి ఐదు టీ20 ఇన్నింగ్స్‌లలో 34 *, 1, 21 *, 7, 6 పరుగులు చేసింది. అయితే ఎప్పుడైనా చెలరేగే సామర్థ్యం ఆమెకు ఉంది.

Story first published: Friday, January 24, 2020, 12:50 [IST]
Other articles published on Jan 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X