మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసు.. హార్దిక్, రాహుల్‌కు జరిమానా

ప్రపంచకప్ ముందు భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్‌లకు ఉపశమనం లభించింది. ఓ టీవీ షోలో మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఈ ఇద్దరిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అంబుడ్స్‌మన్ రిటైర్డ్ జస్టిస్ డి.కె. జైన్ రూ. 20 లక్షల చొప్పున జరిమానా విధించారు. తదుపరి శిక్షలేమీ లేదని స్పష్టం చేసాడు.

రూ.20 లక్షల జరిమానా:
ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబై జట్టుకి హార్దిక్ పాండ్య, పంజాబ్ జట్టుకి కేఎల్ రాహుల్‌లు ఆడుతున్నారు. వీళ్లిద్దరూ ఈ కేసుకు సంబంధించి ఇటీవలే బీసీసీఐ అంబుడ్స్‌మన్ డీకే జైన్ ముందు విచారణకు హాజరైయ్యారు. ఇప్పటికే సస్పెన్షన్ కూడా ఎదుర్కొన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జైన్ తలో రూ.20 లక్షల జరిమానాతో సరిపెట్టాడు. దీంతో ఈ కేసు ముగిసిపోయింది.

నాలుగు వారాల గడువు:
పాండ్య, రాహుల్ జరిమానా మొత్తాల్ని బీసీసీఐకి కట్టాల్సిన అవసరం లేదు. సైనిక విధుల్లో భాగంగా ప్రాణాలు కోల్పోయిన పది మంది జవాన్ల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ( రూ.20 లక్షలు) చెల్లించాలి. ఇక మిగతా రూ.20 లక్షలు భారత అంధుల క్రికెట్ సంఘం సహాయ నిధికి అందజేయాలి. ఈ మొత్తాన్ని ఈనెల 19 నుంచి నాలుగు వారాల్లోగా చెల్లించాలని జైన్ ఆదేశించారు.

స్పందించిన బీసీసీఐ:
ఈ ఏడాది జనవరిలో ప్రసారమైన టీవీ షోలో పాండ్య, రాహుల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఇద్దరూ అమ్మాయిలతో తమకున్న సంబంధాలు, శృంగార కార్యకలాపాల గురించి బహిరంగంగా మాట్లాడారు. ఈ వాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీయడంతో.. బీసీసీఐ వెంటనే స్పందించింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న వీళ్లిద్దరినీ స్వదేశానికి రప్పించి సస్పెన్షన్ వేటు వేసింది. అనంతరం వీరు క్షమాపణలు చెప్పారు. ఇక బీసీసీఐ పాలకుల కమిటీ వీరిపై సస్పెన్షన్ తొలగించి.. తదుపరి చర్యల కోసం విచారణకు ఆదేశించింది. తాజా తీర్పుతో ఈ కేసుకు తెరపడింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications