24వ పడిలోకి పాండ్యా: 'నువ్వు లేకుండా నేను లేను'

Posted By:

హైదరాబాద్: టీమిండియా యువ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా బుధవారం 24వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా పలువురు మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు సైతం పాండ్యాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే అందరిలోకెల్లా సోదరుడు కృనాల్ పాండ్యా చెప్పిన పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి.

కృనాల్ పాండ్యాకు హార్ధిక్ పాండ్యా అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. తమ్ముడి పుట్టినరోజు సందర్భంగా హార్దిక్ పాండ్యాతో తనకున్న అనుబంధాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. ఐపీఎల్లో వీరిద్దరూ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. హార్ధిక్ పాండ్యా ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్‌లో బిజీగా ఉన్నాడు.

తమ్ముడు నువ్వంటే నాకు పిచ్చి

'తమ్ముడు.. నీకో విషయం తెలుసా. నువ్వుంటే నాకు పిచ్చి. కొన్ని సార్లు కోపంతో నీ మీద అరిచాను. కానీ నిజం ఏమిటంటే నువ్వు లేకుండా నేను ఉండలేను'.

నువ్వే నాకు స్ఫూర్తి, బలం

'నువ్వే నాకు స్ఫూర్తి, బలం. నువ్వు సాధిస్తోన్న, అందుకుంటోన్న విజయాల పట్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నా'.

నీ కోసం ఎల్లప్పుడూ నేను ఉంటాను

'ఇది నీకు, మనకు ప్రారంభం మాత్రమే అని నాకు తెలుసు. ఈ సందర్భంగా నీకు నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను. నీ కోసం ఎల్లప్పుడూ నేను ఉంటాను. ఐ లవ్యూ సో మచ్‌'.

దేవుని దీవెనలు నీకు ఉంటాయి

'హ్యాపీ బర్తడే మై బ్రో. దేవుని దీవెనలు నీకు ఉంటాయి. ఎప్పుడూ వెలుగుతూ ఉండు' అని కృనాల్‌ పాండ్యా పేర్కొన్నాడు.

నాకు తెలుసు అన్నయ్యా

'నాకు తెలుసు అన్నయ్యా. నా భావన కూడా అదే' అని హార్దిక్‌ పాండ్యా ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

పాండ్యాకు బీసీసీఐ శుభాకాంక్షలు

ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యకు జన్మదిన శుభాకాంక్షలు

పాండ్యాకు ఐసీసీ శుభాకాంక్షలు

భారత హార్డ్‌ హిట్టింగ్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యకు హ్యాపీ బర్తడే. భవిష్యత్తులో పాండ్య నుంచి గొప్ప ఇన్నింగ్సులు చూస్తాం.

పాండ్యాకు హర్భజన్‌ సింగ్‌ శుభాకాంక్షలు

పాండ్యా వెరీ హ్యాపీ బర్త్‌డే. అంతర్జాతీయ క్రికెట్‌లో నీ వృద్ధి అద్భుతంగా ఉంది. ఇదే ఫామ్‌ను కొనసాగించు.

పాండ్యాకు ముంబై ఇండియన్స్ శుభాకాంక్షలు

ఈ ఏడాది పాండ్య కెరీర్‌ అద్భుతంగా సాగింది. భవిష్యత్తులో ఇలాగే కొనసాగుతూ.. విజయాలను అందుకోవాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్‌డే పాండ్యా.

Story first published: Wednesday, October 11, 2017, 14:54 [IST]
Other articles published on Oct 11, 2017
Please Wait while comments are loading...
POLLS