న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కోహ్లీ' విజయ రహస్యం నాకు చెప్పాడు: హార్దిక్ పాండ్యా

Hardik Pandya gets invaluable cricketing lesson from Virat Kohli on asking reason for his success


ముంబై:
ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచ క్రికెట్‌లోనే నంబర్ వన్ బ్యాట్స్‌మెన్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఫార్మాట్ ఏదైనా క్రీజులోకి వచ్చాడంటే పరుగుల వరద పారాల్సిందే. ఇక ఛేజింగ్ సమయంలో అయితే కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు తపిస్తుంటాడు. జట్టు విజయం కోసం ఎంతగానో కష్టపడతాడు. కెప్టెన్సీ, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లలో అత్యుత్తమ ప్రదర్శనే కోహ్లీని అగ్రశ్రేణి ఆటగాడిగా నిలబెట్టాయి. అయితే విరాట్ కోహ్లీ తన విజయ రహస్యంను టీమిండియా స్టార్ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యాకు చెప్పాడట.
 విజయ మంత్రమిదే:

విజయ మంత్రమిదే:

సొంత కష్టంతో అగ్రస్థానానికి చేరేందుకు కృషి చేయాలని, ఎవరినీ కిందికి నెట్టాలని అనుకోకూడదని విరాట్​ కోహ్లీ తనతో చెప్పాడని శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో హార్దిక్ పాండ్యా తెలిపాడు. 'రెండు రోజుల క్రితం విరాట్ కోహ్లీతో నేను మాట్లాడుతూ.. నీ విజయానికి కారణాలేంటి? అని అడిగాను. అందుకు అతడు.. నీ యాటిట్యూడ్ బాగుంది. ఆట బాగుంది. కానీ నిలకడ సాధించాలి అన్నాడు. సరైన మార్గంలో నంబర్ వన్ అయ్యేందుకు చాలా తపన పడాలి. కానీ ఎవరినీ వెనక్కి నెట్టాలని చూడకూడదు. స్వయంకృషితో, స్వశక్తితో అగ్రస్థానానికి చేరడమే లక్ష్యంగా పెట్టుకోవాలి అని కోహ్లీ నాతో చెప్పాడు' అని హార్దిక్ తెలిపాడు.

 ధోనీ, రోహిత్ నంబర్​.2గా ఉండడానికి ఇష్టపడరు:

ధోనీ, రోహిత్ నంబర్​.2గా ఉండడానికి ఇష్టపడరు:

'విరాట్ కోహ్లీ అంత నిలకడగా.. ఎలా, ఎందుకు ఉండగలుగుతున్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది. అతడితో పాటు రోహిత్​ శర్మ, ఎంఎస్ ధోనీ లాంటి వారు కూడా నంబర్​.2గా ఉండడానికి ఇష్టపడరు. ఒకవేళ ఆ స్థానానికి వెళ్లినా.. వారు పెద్దగా పట్టించుకోరు. వారందరూ అగ్రస్థానంలోనే ఉండాలనుకుంటారు. వారి గొప్పతనమేంటంటే.. రెండో స్థానానికి చేరినా దాన్ని సమస్యగా భావించరు. మళ్లీ నంబర్​.1​గా అవతరించేందుకు తీవ్రంగా కృషి చేయడం ప్రారంభిస్తారు' అని హార్దిక్ చెప్పాడు.

32కి మించి సగటు లేదు:

32కి మించి సగటు లేదు:

2016లో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన హార్దిక్ పాండ్యా 11 టెస్టులు, 54 వన్డేలు, 40 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. కానీ ఏ ఫార్మాట్‌లోనూ అతని సగటు 32కి మించిలేదు. మరోవైపు 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 86 టెస్టులాడి 53.63 సగటుతో 7,240 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 248 వన్డేల్లో 59.34 సగటుతో 11,867 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 58 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 81 టీ20లలో 50.8 సగటుతో 2,794 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 21,901 పరుగులు చేశాడు.

 ఇంటికే పరిమితం:

ఇంటికే పరిమితం:

గతేడాది సెప్టెంబర్‌లో వెన్నుగాయంతో టీమిండియాకు దూరమైన హార్దిక్‌ పాండ్యా .. శస్త్ర చికిత్స తర్వాత గత ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌ 'ఎ' పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కాగా చివరి నిమిషంలో హార్దిక్‌ ఇంకా కోలుకోలేకపోవడంతో ఆ పర్యటనకు దూరమయ్యాడు. ఆపై దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు ఎంపికైనా.. అది కరోనా వైరస్‌ కారణంగా జరగలేదు. ముంబైలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న కారణంగా హార్దిక్ ఇంటికే పరిమితమయ్యాడు. ఇంట్లో తాను చేసే పనులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు.

వైరల్ వీడియో.. పరుగును మెరుగుపరుచుకునేందుకు షమీ ఏంచేస్తున్నాడో తెలుసా?!!

Story first published: Saturday, June 27, 2020, 12:31 [IST]
Other articles published on Jun 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X