న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలిసారి భారత్ తరుపున ఓ అంతర్జాతీయ మ్యాచ్‌లో పాండ్యా సోదరులు

India Vs New Zealand : Pandya Brothers Are Playing For India In T20s | Oneindia Telugu
Hardik and Krunal Pandya set to play alongside each other at international level for first time

హైదరాబాద్: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, అతని సోదరుడు కృనాల్‌ పాండ్యాలు తొలిసారి భారత్ తరుపున ఓ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో కలిసి ఆడనున్నారు. ఇందుకు న్యూజిలాండ్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్‌ వేదిక కానుంది. పాండ్యా బ్రదర్స్‌ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసినప్పటికి ఇప్పటి వరకు ఇద్దరూ ఒక్క మ్యాచ్‌లో కూడా అడలేదు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్, కృనాల్ పాండ్యాలు బరిలోకి దిగే అవకాశం ఉంది.

భారత జట్టులో కీలక సభ్యుడు: పాండ్యా ప్రదర్శనపై భజ్జీ ప్రశంసలుభారత జట్టులో కీలక సభ్యుడు: పాండ్యా ప్రదర్శనపై భజ్జీ ప్రశంసలు

పాండ్యా సోదరులు అరుదైన ఘనత

ఇదే జరిగేతే పాండ్యా సోదరులు అరుదైన ఘనత సాధించనున్నారు. భారత్ తరుపున అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడిన మూడో బ్రదర్స్‌గా గుర్తింపు పొందనున్నారు. అంతకముందు భారత్ తరుపున అమర్‌నాథ్‌ సోదరులు, పఠాన్‌ సోదరులు ఓ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లో భారత్ తరుపున కలిసి ఆడారు.

తొలి టెస్ట్‌ సెంచరీ సాధించిన

తొలి టెస్ట్‌ సెంచరీ సాధించిన

భారత్‌ తరఫున తొలి టెస్ట్‌ సెంచరీ సాధించిన లాల్‌ అమర్‌నాథ్‌ కుమారులైన మహిందర్‌ అమర్‌ నాథ్‌, సురీంధర్‌ అమర్‌ నాథ్‌లు భారత్‌ తరపున బ్రదర్స్‌గా తొలిసారి బరిలోకి దిగారు. ఆ తర్వాత ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసఫ్‌ పఠాన్‌లు భారత్‌కు ప్రాతినిధ్యం వహించి ఈ జాబితాలో చేరారు. పఠాన్‌ సోదరులు ఎన్నో అద్భుతమైన మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేసి భారత్‌కు చిరస్మరణీయ విజయాలను అందించారు.

59 పరుగుల భాగస్వామ్యం

59 పరుగుల భాగస్వామ్యం

2009లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరూ 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు విజయాన్ని అందించారు. తాజాగా ఇప్పుడు భారత్‌ తరఫున పాండ్యా సోదరులు బరిలోకి దిగుతున్నారు. నిజానికి ఇంగ్లాండ్‌తో గతేడాది ముగిసిన టీ20 సిరీస్‌‌లోనే పాండ్యా సోదరులు కలిసి బరిలో దిగాల్సి ఉండగా కృనాల్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు.

విండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో కృనాల్ అరంగేట్రం

విండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో కృనాల్ అరంగేట్రం

ఆ తర్వాత స్వదేశంలో వెస్టిండీస్‌ జరిగిన మ్యాచ్‌‌లో కృనాల్‌ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అదే సమయంలో పాండ్యా గాయంతో జట్టుకు దూరమయ్యాడు. దీంతో ఇప్పటి వరకు వీరిద్దరూ కలిసి బరిలోకి దిగలేదు.

Story first published: Tuesday, February 5, 2019, 13:56 [IST]
Other articles published on Feb 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X