న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భజ్జీని 'ముసలి కుక్క'తో పోల్చిన నెటిజన్: ట్విట్టర్‌లో ఘాటు సమాధానం

By Nageshwara Rao
Harbhajan Singh slams Twitter user who called him ‘old dog’

హైదరాబాద్: టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడు. తాజాగా తనని 'ఓల్డ్ డాగ్' తో పోలుస్తూ రిటైర్మెంట్ సలహా తీసుకోవాలని సూచించిన ఓ నెటిజన్‌పై తనదైన శైలిలో మండిపడ్డాడు. దీనికి సంబంధించిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అసలేం జరిగింది?
హర్భజన్ ప్రస్తుతం రంజీ ట్రోఫీ-2017లో పంజాబ్‌ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇందులో భాగంగా నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న ఓ ఫోటోను హర్భజన్ తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ ఫోటోపై నియోల్ స్మిత్ అనే వ్యక్తి ఈ విధంగా స్పందించాడు. 'క్రికెట్‌లో నీ మంచి రోజులు అయిపోయాయి. పాత కుక్కవి అయిన నువ్వు కొత్త ట్రిక్కులు నేర్చుకోవడంలో విఫలమయ్యావు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి గౌరవప్రదంగా తప్పుకో. తెలివి తక్కువగా ప్రవర్తించి పేరును పాడుచేసుకోకు. నీ పని అయిపోయిందన్న సంగతిని గుర్తించి త్వరగా తప్పుకుంటే మంచిది' అని ట్వీట్‌ చేశాడు.

ఈ ట్వీట్‌ను చూసిన హర్భజన్ కూడా తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు. 'నీలాంటి పాత కుక్కలు అరవడానికే పనికొస్తాయి. నువ్వా పనిలోనే ఉండు. నీవు నేర్చుకున్నది ఇంతే అన్నమాట. జీవితంలో ఓడిపోయిన వారే ఇటువంటి సలహాలు ఇస్తుంటారు. నేర్చుకునేందుకు ప్రతి రోజూ ఏదో ఒక విషయం ఉంటుంది. నీ సలహాలు నాకు అక్కర్లేదు. ముందు ఇతరులకు సలహాలు ఇవ్వడం మానుకో' అని ట్వీట్ చేశాడు.

37 ఏళ్ల హర్భజన్ సింగ్ చివరిసారిగా 2016లో యూఏఈతో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత జెర్సీని ధరించాడు. 2015 తర్వాత వన్డేలు, టెస్టులకు పూర్తిగా దూరమయ్యాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, November 23, 2017, 14:54 [IST]
Other articles published on Nov 23, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X