న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దేశంలో ఇతనికంటే మెరుగైన స్పిన్నర్లే లేరా: సెలెక్టర్లపై హర్భజన్ ఫైర్

Harbhajan Singh slams selectors for picking up Washington Sundar

భారత్‌లో అంతమంచి స్పిన్నర్లు ఉండగా వాషింగ్టన్ సుందర్‌నే ఎందుకు ఎంపిక చేశారని సెలక్టర్లపై టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ విరుచుకుపడ్డాడు. అసలు వాషింగ్టన్ సుందర్ బాల్‌ను స్పిన్ చేయలేడని విమర్శించాడు. జలజ్ సక్సేనా అనే స్పిన్నర్‌ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని ఈ టర్బనేటర్ ప్రశ్నించాడు. గత కొన్ని సీజన్‌లుగా జలజ్ సక్సేనా ఆటతీరు చాలా బాగుందని ప్రశంసలు కురిపించిన హర్భజన్ సింగ్ అతన్ని ఎందుకు పరిగణించలేదని ప్రశ్నించాడు.

మరోవైను అక్షయ్ వఖారే కూడా స్థిరమైన బౌలర్ అని అతన్ని కూడా సెలెక్టర్లు పక్కనబెట్టడాన్ని ఎలా చూడాలని ప్రశ్నించాడు. మంచి స్పిన్నర్లను ఉంచుకుని కూడా స్పిన్నర్లు లేరనే వ్యాఖ్యలు సహించరానివని ఆగ్రహం వ్యక్తం చేశాడు హర్భజన్ సింగ్.

ఫస్ట్ క్లాస్ సీజన్‌లో జలజ్ సక్సేనా 347 వికెట్లు తీసుకుని 6,334 పరుగులు చేశాడు. మరోవైపు ఆదిత్య వఖారే 279 వికెట్లు పడగొట్టాడని హర్భజన్ సింగ్ చెప్పాడు. బంతిని కూడా తిప్పడం చేతకాని వాషింగ్టన్ సుందర్‌ను ఎలా సెలెక్టర్లు సెలెక్ట్ చేశారో అర్థం కావడం లేదని భజ్జీ నిప్పులు చెరిగాడు.

సరైన పద్ధతిలో సరైన రీతిలో బంతిని స్పిన్ చేయగల బౌలర్లను ఎందుకు ఎంపిక చేయరని భజ్జీ ప్రశ్నించాడు. బ్యాట్స్‌మెన్‌ను టెంప్ట్ చేసి బంతులను ఆడేందుకు ముందుకొచ్చేలా చేసి స్టంప్ అవుట్ చేయగల సమర్థవంతమైన స్పిన్నర్లను ఎందుకు ఎంపిక చేయరని హర్భజన్ సింగ్ ప్రశ్నించాడు.

ఇలాంటి సమర్థవంతమైన స్పిన్నర్లకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలని హర్భజన్ సింగ్ సూచించారు. జలజ్ సక్సేనాను ఎంపిక చేయకపోవడానికి కారణమేంటో చెప్పాలని హర్భజన్ సింగ్ డిమాండ్ చేశాడు. వికెట్లు తీయడమే జలజ్ సక్సేనా, షాబాజ్ నదీమ్ , వఖారేలు చేసిన నేరమా అని ప్రశ్నించాడు. ఇదిలా ఉంటే సెలెక్టర్ల తీరుపై గతంలో కూడా భజ్జీ పలు మార్లు తప్పుబట్టాడు. టాలెంట్ ఉన్న వారికి అవకాశాలు ఇవ్వకుండా సెలెక్టర్లు తమకు తోచినట్లుగా వ్యవహరించడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

Story first published: Sunday, March 8, 2020, 14:38 [IST]
Other articles published on Mar 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X