న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హర్భజన్‌ ఆల్‌టైమ్‌ టెస్టు జట్టు.. ధోనీ, కోహ్లీలకు దక్కని చోటు.. భారత్ నుంచి ముగ్గురికే ఛాన్స్!!

Harbhajan Singh picks his all-time best Test XI with three Indians


ముంబై:
ఇటీవలి కాలంలో క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లు తమ ఫేవరేట్ జట్లను ప్రకటించడం సాధారణం అయింది. ప్రపంచకప్, ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీల ముందు, తర్వాత దిగ్గజాలు ఫేవరేట్ జట్లను ప్రకటిస్తారు. సాధారణ సమయంలో కూడా ప్రకటిస్తారనుకోండి. ఈక్రమంలో టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ తన ఆల్‌టైమ్‌ అత్యుత్తమ టెస్టు జట్టును ఎంపిక చేశాడు. 11 మందితో కూడిన జట్టును హర్భజన్‌ తాజాగా వెల్లడించాడు.

అరుదైన ఛాన్స్‌.. పెప్సీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా షెఫాలీ వర్మ!!అరుదైన ఛాన్స్‌.. పెప్సీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా షెఫాలీ వర్మ!!

ధోనీ, కోహ్లీలకు నో ప్లేస్:

ధోనీ, కోహ్లీలకు నో ప్లేస్:

హర్భజన్‌ సింగ్‌ తన టెస్టు జట్టులో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీలకు అవకాశం ఇవ్వలేదు. తన టెస్టు ఎలెవన్‌లో ప్రధానంగా అంతర్జాతీయ కెరీర్‌లో తనతో పాటు ఆడిన క్రికెటర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఇక భజ్జీ తన టెస్టు ఎలెవన్‌లో ముగ్గురు భారత క్రికెటర్లకు మాత్రమే చోటు కల్పించాడు. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌, ద వాల్‌ రాహుల్‌ ద్రవిడ్‌, డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌లకు చోటిచ్చాడు.

కెప్టెన్‌గా పాంటింగ్‌:

కెప్టెన్‌గా పాంటింగ్‌:

ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్‌ను హర్భజన్‌ సింగ్‌ తన ఆల్‌టైమ్‌ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఎంచుకున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్‌, మాథ్యూ హేడెన్‌లను ఓపెనర్లుగా తీసుకున్నాడు. మూడు, నాలుగులో ద్రవిడ్‌, సచిన్‌లకు అవకాశం ఇచ్చాడు. వికెట్‌ కీపర్‌గా శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కరను ఎంపిక చేసుకున్నాడు. ఆల్‌రౌండర్‌ కోటాలో జాక్వస్‌ కల్లిస్‌ను ఎంచుకున్నాడు.

అక్రమ్‌కు చోటు:

అక్రమ్‌కు చోటు:

భజ్జీ తన టెస్టు జట్టులో భారత్‌ బౌలింగ్‌ యూనిట్‌ నుంచి ఏ ఒక్కరికీ అవకాశం ఇవ్వలేదు. ముఖ్యంగా ఆసీస్‌ దిగ్గజ ఆటగాళ్లు గ్లెన్‌ మెక్‌గ్రాత్‌, షేన్‌ వార్న్‌లతో పాటు దక్షిణాఫ్రికా మాజీ పేసర్‌ షాన్‌ పొలాక్‌ను ఎంపిక చేశాడు. పాకిస్తాన్‌ నుంచి వసీం అక్రమ్‌కు భజ్జీ చోటు కల్పించాడు. అయితే భజ్జీ తన టెస్టు జట్టులో తన పేరును మాత్రం చేర్చుకోలేదు.

హర్భజన్‌ టెస్టు జట్టు:

హర్భజన్‌ టెస్టు జట్టు:

రికీ పాంటింగ్‌ (కెప్టెన్‌), వీరేంద్ర సెహ్వాగ్‌, మాథ్యూ హేడెన్‌, రాహుల్‌ ద్రవిడ్‌, సచిన్‌​ టెండూల్కర్‌, జాక్వస్‌ కల్లిస్‌, కుమార సంగక్కర, షాన్‌ పొలాక్‌, షేన్‌ వార్న్‌, వసీం అక్రమ్‌, గ్లెన్‌ మెక్‌గ్రాత్‌.

Story first published: Friday, March 6, 2020, 20:02 [IST]
Other articles published on Mar 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X