న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'రాయుడు అవకాశాన్ని చక్కగా వాడుకున్నాడు'

Harbhajan Singh: India has the upper hand against a depleted Australian side

హైదరాబాద్: టీమిండియా జట్టులో నాలుగో స్థానానికి అంబటి రాయుడు సరైనోడని హర్భజన్‌సింగ్‌ అన్నాడు. పేసర్లు, స్పిన్నర్లను రాయుడు సమర్థంగా ఎదుర్కోగలడని తెలిపాడు. గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్స్‌ ఫర్‌ ఆల్‌ (ఎఫ్‌ఎఫ్‌ఏ) నిర్వహిస్తున్న అంతర్‌ పాఠశాలల క్రీడల్ని బుధవారం భజ్జీ పరిశీలించాడు. స్టేడియమంతా కలియదిగిరి చిన్నారుల్లో ఉత్సాహం నింపాడు. అనంతరం భజ్జీ మాట్లాడాడు.

అవకాశాన్ని నిరూపించుకున్న రాయుడు

అవకాశాన్ని నిరూపించుకున్న రాయుడు

రాయుడు ప్రతిభావంతుడు. అవకాశమివ్వగానే తనేంటో నిరూపించుకున్నాడు. కెప్టెన్‌ అండగా నిలవడంతో రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నాడు. 2003-04 రంజీ ట్రోఫీ సీజన్‌లో రాయుడు పేరు ప్రముఖంగా వినిపించింది. అప్పుడు అందరం అతడి గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందో గానీ అతను రేసులో కనిపించలేదు. రాయుడుతో కలిసి ముంబై ఇండియన్స్‌కు ఆడా.

భువనేశ్వర్ గురించే భారత్‌కు బెంగ

చెన్నై తరపున అదరగొట్టిన రాయుడు

చెన్నై తరపున అదరగొట్టిన రాయుడు

ఈ ఏడాది చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున రాయుడు అదరగొట్టాడు. ఇప్పుడు టీమ్‌ఇండియా తరఫున సత్తాచాటుతున్నాడు. ఫాస్ట్‌ బౌలర్లు.. నాణ్యమైన స్పిన్నర్ల బౌలింగ్‌లో రాయుడు చక్కగా ఆడుతున్నాడు. నాలుగో నంబర్‌ బ్యాట్స్‌మన్‌ కోసం టీమ్‌ఇండియా ఎప్పట్నుంచో ఎదురుచూస్తుంది. ఆ స్థానానికి రాయుడు సరైనోడు. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌, చాహల్‌ల మధ్య పోటీ ఉండటం మంచిదే. అప్పుడే అత్యుత్తమ ప్రదర్శన బయటకు వస్తుంది.

తుదిజట్టులో ముగ్గురికి చోటిస్తే

తుదిజట్టులో ముగ్గురికి చోటిస్తే

ముగ్గురికి తుదిజట్టులో చోటిస్తే బాగుంటుందన్నది నా అభిప్రాయం. జడేజాకు బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ అదనపు అర్హతలు. కుల్‌దీప్‌ ఛాంపియన్‌ బౌలర్‌. చాహల్‌ సమర్థుడైన బౌలర్‌. ఈ ముగ్గురు ప్రపంచ కప్‌ ఆడేందుకు అర్హులు. రానున్న ఆస్ట్రేలియా పర్యటనలో సత్తాచాటేందుకు టీమ్‌ఇండియాకు మంచి అవకాశం. స్మిత్‌, వార్నర్‌ లేకపోవడం టీమ్‌ఇండియాకు కలిసొస్తుంది. సెలెక్షన్‌ కమిటీతో అభిప్రాయ భేదాలున్న మాట నిజమే.

మ్యాచ్‌ ఆడించకుండానే కరుణ్‌ నాయర్‌ను

మ్యాచ్‌ ఆడించకుండానే కరుణ్‌ నాయర్‌ను

ఒక్క మ్యాచ్‌ ఆడించకుండానే కరుణ్‌ నాయర్‌ను తొలగించారు. మరికొద్ది మందికి అలాంటి అనుభవమే ఎదురైంది. కొందరు ఏం చేయకుండానే ఆడుతున్నారు. ఇక సినిమా తీసేంత గొప్ప కథ కాదు నా జీవితం. నాకంటే ఎక్కువ స్ఫూర్తిగా నిలిచిన వారెందరో ఉన్నారు. వారి తర్వాతే నేను. నా జీవిత విశేషాలతో భవిష్యత్తులో పుస్తకం రాస్తా. హైదరాబాద్‌.. ఇక్కడి బిర్యానీ నాకు చాలా ఇష్టం.

Story first published: Thursday, November 1, 2018, 11:05 [IST]
Other articles published on Nov 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X