న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాక్సింగ్ డే టెస్టులో 66 బంతుల్లో 8: హనుమ విహారి ఖాతాలో చెత్త రికార్డు

Hanuma Vihari batting strike-rate in mcg 66-ball 8 slowest test innings by an indian

హైదరాబాద్: మెల్‌బోర్న్ వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఓపెనర్‌గా బరిలోకి దిగిన తెలుగు కుర్రాడు హనుమ విహారి ఖాతాలో ఓ చెత్త రికార్డు నమోదైంది. ఈ మ్యాచ్‌లో హనుమ విహారి మొత్తం 8 బంతులను ఎదుర్కొని కేవలం 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు.

<strong>మయాంక్ టెస్టు అరంగేట్రంపై ట్విట్టర్‌లో కేఎల్ రాహుల్ ఇలా! (ట్వీట్)</strong>మయాంక్ టెస్టు అరంగేట్రంపై ట్విట్టర్‌లో కేఎల్ రాహుల్ ఇలా! (ట్వీట్)

దీంతో భారత్ తరుపున టెస్టుల్లో అత్యంత తక్కువ స్ట్రైక్ రేట్‌ని కలిగి ఉన్న ఆటగాడిగా హనుమ విహారి ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతక ముందు ఈ చెత్త రికార్డు ది వాల్ రాహుల్ ద్రవిడ్ పేరిట ఉంది. 2007లో ఇదే మైదానంలో జరిగిన టెస్టులో రాహుల్ ద్రవిడ్ 66 బంతుల్లో 5 పరుగులు చేసి ఔటయ్యాడు.

బాక్సింగ్ డే టెస్టులో విహారి చెత్త రికార్డు

బాక్సింగ్ డే టెస్టులో విహారి చెత్త రికార్డు

ఇది కూడా బాక్సింగ్ డే టెస్టు కావడం విశేషం. కాగా, గత రెండు టెస్టుల్లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్, మురళీ విజయ్‌లు ఘోరంగా విఫలం కావడంతో సెలక్టర్లు మూడో టెస్టు నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. దీంతో మూడో టెస్టులో ఓపెనర్లుగా హనుమ విహారి, మయాంక్ అగర్వాల్‌లకు ఓపెనర్లుగా అవకాశం వచ్చింది.

 టాస్ గెలిచిన కోహ్లీ

టాస్ గెలిచిన కోహ్లీ

కాగా, బుధవారం ప్రారంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మయాంక్ అగర్వాల్, హనుమ విహారి ఓపెనర్లుగా వచ్చారు. ఆస్ట్రేలియా గడ్డపై 71 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో ఆరంగేట్రం చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా మయాంక్ చరిత్ర సృష్టించాడు. మ్యాచ్‌ ప్రారంభమైన కాసేపటికే ఓపెనర్‌ హనుమ విహారి ఔటయ్యాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మాత్రం చక్కటి శుభారంభాన్ని ఇచ్చాడు.

 ఆరోన్ ఫించ్‌కు క్యాచ్ ఇచ్చిన విహారి

ఆరోన్ ఫించ్‌కు క్యాచ్ ఇచ్చిన విహారి

వీరిద్దరూ తొలి వికెట్‌కు 40 పరుగులు జోడించారు. కమ్మిన్స్ బౌలింగ్‌లో హనుమ విహారి(8) స్లిప్‌లో ఆరోన్ ఫించ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారాతో కలిసి రెండో వికెట్‌కు 79 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. స్పిన్నర్ నాథన్ లియాన్ వేసిన 36వ ఓవర్ ఆఖరి బంతిని ఫోర్ బాది 95 బంతుల్లో మయాంక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

అరంగేట్రం టెస్టులో మయాంక్ హాఫ్ సెంచరీ

అరంగేట్రం టెస్టులో మయాంక్ హాఫ్ సెంచరీ

తద్వారా ఆసీస్ గడ్డపై ఆరంగేట్ర టెస్టులోనే హాఫ్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా మయాంక్ చరిత్ర సృష్టించాడు. జట్టు స్కోరు 123 పరుగుల వద్ద కమిన్స్ వేసిన షార్ట్‌పిచ్ బంతికి మయాంక్ అగర్వాల్ పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి నిలకడగా ఆడిన పుజారా 152 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. టెస్టు కెరీర్‌లో పుజారాకిది 21వ హాఫ్ సెంచరీ.

 బాక్సింగ్ టెస్టులో తొలిరోజు భారత్ 215/2

బాక్సింగ్ టెస్టులో తొలిరోజు భారత్ 215/2

కోహ్లీ-పుజారా జోడీని ఆసీస్ బౌలర్లు తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు. మయాంక్‌తో కలిసి రెండో వికెట్‌కు 83 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన పుజారా.. కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. క్రీజులో పుజారా(68), విరాట్ కోహ్లీ (47) పరుగులతో క్రీజులో ఉన్నారు.

1
43625
Story first published: Wednesday, December 26, 2018, 18:50 [IST]
Other articles published on Dec 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X