న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హ్యాంప్‌షైర్‌ జట్టుతో రహానే ఒప్పందం

IPL 2019 : Ajinkya Rahane Becomes 1st Overseas Cricketer To Join Hampshire || Oneindia Telugu
Hampshire sign India batsman Ajinkya Rahane as Markram replacement

టీమిండియా బ్యాట్స్‌మన్‌ అజింక్యా రహానే ఇంగ్లిష్‌ కౌంటీల్లో ఆడేందుకు హ్యాంప్‌షైర్‌ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. హ్యాంప్‌షైర్‌ జట్టు బ్యాట్స్‌మన్‌, దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్క్‌రమ్‌ స్థానంలో అజింక్యా రహానే తీసుకున్నట్లు ఆ జట్టు యాజమాన్యం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.

మే 30 నుండి మెగా టోర్నీ ప్రపంచకప్‌ 2019 ఉన్న నేపథ్యంలో మార్క్‌రమ్‌ స్వదేశానికి వెళ్లిపోయాడు. మార్క్‌రమ్‌ స్థానంలో టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ కోసం రహానెను తీసుకున్నారు. దీంతో హ్యాంప్‌షైర్‌కు ఆడనున్న మొదటి భారత క్రికెటర్‌గా రహానే రికార్డులోకి ఎక్కాడు. ఇంతకుముందు భారత టెస్ట్ స్పెషలిస్ట్ క్రికెటర్‌ఛతేశ్వర పుజారా ఇంగ్లిష్‌ కౌంటీల్లో ఆడాడు. పుజారా యార్క్ షైర్‌ జట్టుతో మూడు సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ఐపీఎల్‌ అనంతరం ఇంగ్లండ్‌కు:

ఐపీఎల్‌ అనంతరం ఇంగ్లండ్‌కు:

రహానే ప్రస్తుతం ఐపీఎల్‌ సీజన్-12లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆ జట్టుకు సారధ్య బాధ్యతలు నిర్వహించాడు. తాజాగా ఒక శతకం కూడా చేసాడు. ఐపీఎల్‌ ముగిసిన అనంతరం రహానే ఇంగ్లండ్‌కు వెళ్లనున్నాడు. వన్డే లీగ్‌ ఏప్రిల్‌ 25న మొదలై.. మే 25తో ముగుస్తుంది.

బీసీసీఐకి కృతజ్ఞతలు:

బీసీసీఐకి కృతజ్ఞతలు:

ఈ అరుదైన అవకాశం రావడంపై రహానె మాట్లాడుతూ... 'హ్యాంప్‌షైర్‌కు ఆడుతున్న తొలి భారతీయుడిని కావడం ఆనందంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కౌంటీ క్రికెట్‌కు మంచి పేరుంది. నా వంతుగా ఎక్కువ పరుగులు చేసి జట్టు విజయానికి కృషి చేస్తాను. కౌంటీల్లో ఆడేందుకు నాకు అవకాశం ఇచ్చిన బీసీసీఐకి కృతజ్ఞతలు' అని రహానే పేర్కొన్నారు.

రహానే మంచి క్లాస్ ఆటగాడు:

రహానే మంచి క్లాస్ ఆటగాడు:

'గతంలో రహానే కౌంటీల్లో ఆడేందుకు ఆసక్తి చూపాడు. మార్క్‌రమ్‌, కరుణరత్నే ఇద్దరూ ప్రపంచకప్‌ నేపథ్యంలో స్వదేశానికి వెళ్లిపోవడంతో.. రహానేను తీసుకున్నాం. రహానే మంచి క్లాస్ ఆటగాడు. టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా సేవలు అందిస్తాడు. అతడు జట్టులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉంది. అతని రాక కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం' అని హ్యాంప్‌షైర్‌ యాజమాన్యం తెలిపింది.

Story first published: Friday, April 26, 2019, 11:22 [IST]
Other articles published on Apr 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X