న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మాజీ అథ్లెట్‌కు అనారోగ్యం: సాయం చేస్తామంటూ ముందుకు భజ్జీ, యువీ

By Nageshwara Rao
Hakam Singh Bhattal, Winner of 1978 Asian Games Gold Medal Battling for Life, Neglected by State Government

ఢిల్లీ: క్రీడాకారులు ఫామ్‌లో ఉన్నంత కాలం అందరికీ గుర్తుంటారు. ఒక్కసారి క్రీడులకు దూరమయ్యారా? అంటే వారిని పట్టించుకునే వారుండరు. ఇందుకు సంబంధించిన సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. 1978లో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా గేమ్స్‌లో 20 కిలోమీటర్ల పరుగు పందెంలో హకం సింగ్‌ బట్టల్‌ అనే అథ్లెట్ స్వర్ణ పతకం సాధించాడు.

ప్రస్తుతం హకం సింగ్‌ బట్టల్‌ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రెండు రోజుల క్రితం హకం సింగ్‌ బట్టల్‌ భార్య బియంత్‌ కౌర్‌ మీడియాతో మాట్లాడుతూ చికిత్స చేయించడానికి డబ్బులు లేవంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
"64 ఏళ్ల హకం కిడ్నీ, లివర్‌కు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నాడు. పెన్షన్‌ కింద నెలకు రూ.7 వేలు అందుకుంటున్నాం. ట్రీట్‌మెంట్‌కు చాలా డబ్బులు అవసరం. మా దగ్గర అంత డబ్బు లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సాయం చేయాలని కోరుకుంటున్నా" అని హకం భార్య ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతో ఆమె ఆవేదనను అర్ధం చేసుకున్న పలువురు అతడికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. పంజాబ్‌లోని బర్నాలా డిప్యూటి కమిషనర్‌ ధర్మపాల్‌ గుప్తా రూ.20 వేలు అందించనున్నట్లు ప్రకటించారు. భారత క్రికెటర్లు హర్భజన్‌ సింగ్‌, ఆర్పీ సింగ్‌ కూడా ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. "హకం సింగ్‌ కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాల వివరాలతో పాటు వారి ఫోన్‌ నంబర్ల తెలపండి" అంటూ వారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

Story first published: Wednesday, August 1, 2018, 18:23 [IST]
Other articles published on Aug 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X