న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరో చరిత్ర సృష్టించిన ఆంధ్ర మాజీ క్రికెటర్‌ జీఎస్‌ లక్ష్మి!!

GS Lakshmi set to become 1st woman match referee at global event


దుబాయ్‌: భారత మహిళా మాజీ క్రికెటర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గండికోట సర్వ (జీఎస్‌) లక్ష్మి ఇప్ప్పటికే ఓ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్‌లో పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన తొలి మహిళగా గుర్తింపు పొందిన జీఎస్‌ లక్ష్మి మరో ఘనతను కూడా సాధించనున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ప్రపంచ స్థాయి టోర్నీలో తొలి మహిళా మ్యాచ్‌ రిఫరీగా ఆమె వ్యవహరించనున్నారు.

మొతేరా స్టేడియం ప్రారంభోత్సవంకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్?!!మొతేరా స్టేడియం ప్రారంభోత్సవంకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్?!!

మ్యాచ్‌ రిఫరీగా జీఎస్‌ లక్ష్మి:

మ్యాచ్‌ రిఫరీగా జీఎస్‌ లక్ష్మి:

51 ఏళ్ల జీఎస్‌ లక్ష్మి ఈ నెల 21న ఆస్ట్రేలియాలో ప్రారంభం కానున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో మ్యాచ్‌ రిఫరీగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ మెగా టోర్నీకి మ్యాచ్‌ రిఫరీలుగా వ్యవహరించే ముగ్గురిలో ఏకైక మహిళ జీఎస్‌ లక్ష్మినే కావడం విశేషం. టీ20 ప్రపంచకప్‌కు లక్ష్మితో పాటు స్టీవ్‌ బెర్నార్డ్, క్రిస్‌ బ్రాడ్‌లను మ్యాచ్‌ రిఫరీలుగా ఐసీసీ తాజాగా నియమించింది.

ఐదుగురు మహిళలకు చోటు:

ఐదుగురు మహిళలకు చోటు:

మహిళల టీ20 ప్రపంచకప్‌కు మ్యాచ్‌ అంపైర్లుగా 12 మందిని ఐసీసీ నియమించగా.. అందులో ఐదుగురు మహిళలకు చోటు దక్కింది. లారెన్‌ అగెన్‌బాగ్, కిమ్‌ కాటన్, క్లెయిరీ పొలోసక్, స్యు రెడ్‌ఫెర్న్, జాక్వెలైన్‌ విలియమ్స్ మహిళా అంపైర్లుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ఏడుగురు పురుష అంపైర్లలో భారత్‌ నుంచి నితిన్‌ మీనన్‌కు మాత్రమే చోటు దక్కింది.

లీగ్‌ మ్యాచ్‌లు ముగిశాక:

లీగ్‌ మ్యాచ్‌లు ముగిశాక:

మహిళల టీ20 ప్రపంచకప్‌ లీగ్‌ మ్యాచ్‌లు ముగిశాకే సెమీ ఫైనల్స్, ఫైనల్‌ మ్యాచ్‌లకు ఎవరు అంపైరింగ్‌ చేస్తారో ఐసీసీ ప్రకటిస్తుంది. ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనున్న మెగా టోర్నీ ఈ నెల 21న మొదలవుతుంది. సిడ్నీలో జరిగే తొలి మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడతాయి. అంతర్జాతీయ మహిళల దినోత్సవం మార్చి 8న మెల్‌బోర్న్‌ స్టేడియంలో జరిగే ఫైనల్‌తో టీ20 ప్రపంచకప్‌ ముగుస్తుంది.

మ్యాచ్‌ రిఫరీలు:

మ్యాచ్‌ రిఫరీలు:

స్టీవ్‌ బెర్నార్డ్, క్రిస్‌ బ్రాడ్‌, జీఎస్‌ లక్ష్మి

అంపైర్లు:

లారెన్ అగెన్‌బాగ్, గ్రెగొరీ బ్రాత్‌వైట్, క్రిస్ బ్రౌన్, కిమ్ కాటన్, షాన్ జార్జ్, నితిన్ మీనన్, క్లెయిరీ పొలోసక్, అహ్సాన్ రాజా, స్యు రెడ్‌ఫెర్న్, లాంగ్టన్ రుసెరే, అలెక్స్ వార్ఫ్, జాక్వెలైన్‌ విలియమ్స్.

Story first published: Thursday, February 13, 2020, 9:26 [IST]
Other articles published on Feb 13, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X