న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేషనల్ టాలెంట్ మేనేజర్ పదవికి రాజీనామా చేసిన గ్రెగ్ చాపెల్

Greg Chappell retires National Talent Manager; Cricket Australia start hunt for replacement

హైదరాబాద్: ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం గ్రెగ్ చాపెల్ నేషనల్ టాలెంట్ మేనేజర్ పదవికి రాజీనామా చేశారు. సుమారు తొమ్మిదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగారు. నేషనల్ టాలెంట్ మేనేజర్ పదవితో పాటు ఇటీవలే జాతీయ సెలక్టర్ పదవిని కూడా క్రికెట్ ఆస్ట్రేలియా కట్టబెట్టింది.

ఈ నేపథ్యంలో నేషనల్ సెలక్షన్ ప్యానెల్‌‌లో జాతీయ సెలక్టర్‌గా ఆస్ట్రేలియా పురుషుల జట్టు ఎంపికలో గ్రెగ్ చాఫెల్ కీలకంగా వ్యవహారించాడు. అయితే, సెప్టెంబర్ 30తో ఈ రెండు పదవుల నుంచి చాపెల్ తప్పుకోనున్నాడు. ఈ క్రమంలో గ్రెగ్ చాఫెల్ సేవలకు గాను క్రికెట్ ఆస్ట్రేలియా కొనియాడింది.

సెలక్టర్లు అతడితో మాట్లాడాలి: ధోని రిటైర్మెంట్‌పై గంభీర్‌కు ఎందుకంత ఆసక్తి!సెలక్టర్లు అతడితో మాట్లాడాలి: ధోని రిటైర్మెంట్‌పై గంభీర్‌కు ఎందుకంత ఆసక్తి!

ఈ సందర్భంగా నేషనల్ టీమ్స్ ఈజీఎమ్ బెన్ ఓలీవర్ మాట్లాడుతూ "గ్రెగ్ ఆట కోసం అవిరామంగా పనిచేశాడు. గ్రెగ్ సేవలను వినియోగించుకుని క్రికెట్ ఆస్ట్రేలియా గేమ్‌ను ప్రజలకు మరింత దగ్గరకు చేర్చింది. ఈ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఎంతో లబ్ధి పొందింది. గ్రెగ్ యొక్క జ్ఞానంతో మేము ప్రేరణ పొందాము" అని తెలిపారు.

గ్రెగ్ చాఫెల్ రాజీనామాపై క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ మాట్లాడుతూ "గ్రెగ్ తరతరాలుగా క్రికెట్‌పై సానుకూల ప్రభావాన్ని చూపాడు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్ళలో గ్రెగ్ ఒకరు. కెప్టెన్, కోచ్, సెలెక్టర్, గురువుగా గ్రెగ్ నిజమైన మార్గదర్శకుడు" అని అన్నారు. గ్రెగ్ చాఫెల్ స్థానంలో కొత్తగా గ్రాహం మనోయు బాధ్యతలను స్వీకరించనున్నాడు.

పాక్‌లో శ్రీలంక పర్యటన: షెడ్యూల్, జట్లు, టెలికాస్ట్, లైవ్ స్ట్రీమింగ్, వేదిక వివరాలుపాక్‌లో శ్రీలంక పర్యటన: షెడ్యూల్, జట్లు, టెలికాస్ట్, లైవ్ స్ట్రీమింగ్, వేదిక వివరాలు

గ్రాహం మనోయు గత మూడేళ్లగా క్రికెట్ ఆస్ట్రేలియాలో నేషనల్ పాత్‌వే మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

Story first published: Thursday, September 26, 2019, 19:30 [IST]
Other articles published on Sep 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X