న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చాపెల్‌కు కోచ్‌గా కొనసాగే అర్హత లేదు: వీవీఎస్

Greg Chappell did not know how to run international team: VVS Laxman

న్యూఢిల్లీ: ఒక అంతర్జాతీయ జట్టును నడిపించే సత్తా గ్రెగ్ చాపెల్‌కు లేదని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. ఒక బ్యాట్స్‌మన్‌గా చాపెల్‌ను అభిమానించే తాను అతన్ని కోచ్‌గా అంగీకరించలేనని తన ఆత్మకథ 281 ఆండ్ బియాండ్ అనే పుస్తకంలో ఈ హైదరాబాదీ పొందుపరిచాడు. కివీస్ మాజీ క్రికెటర్ జాన్‌రైట్‌కు కొనసాగింపుగా 2005 నుంచి 2007 వరకు భారత జట్టు ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన గ్రెగ్ చాపెల్..జట్టు సమతుల్యాన్ని ఘోరంగా దెబ్బతీశాడు.

విభిన్నమైన కోచింగ్ పద్ధతులతో

విభిన్నమైన కోచింగ్ పద్ధతులతో

ఆటగాళ్ల మధ్య సఖ్యతను దెబ్బతీస్తూ వర్గాలను ప్రోత్సహించాడు. దీనికి తోడు విభిన్నమైన కోచింగ్ పద్ధతులతో ఆటగాళ్లు గాయాలకు గురయ్యేలా చేశాడు. ఈ ఫలితంగా వెస్టిండీస్ వేదికగా జరిగిన 2007 వన్డే ప్రపంచకప్‌లో భారత్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో తన కెరీర్‌ను ప్రభావితం చేసిన చాపెల్‌పై లక్ష్మణ్ ఆత్మకథలో ఇలా రాసుకొచ్చాడు. జట్టులో కొంత మంది ఆటగాళ్లను అతను ఇష్టపడేవాడు, మరికొంత మందిని దూరంగా పెట్టెవాడు.

ఆటగాళ్ల మధ్య అభిప్రాయ భేదాలు

ఆటగాళ్ల మధ్య అభిప్రాయ భేదాలు

పదవీకాలం మొత్తం ఒక చేదు జ్ఞాపకం. దీంతో మా కళ్ల ముందే జట్టులో ఆటగాళ్ల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. అతను కోచింగ్ చేసినన్ని రోజులు పరిస్థితులు ఇలాగే ఉండేవి. ఏనాడు ఆటగాళ్ల అందరితో కలిసి ఉన్న దాఖలాలు లేవు. అసలు వీళ్లు ఆటగాళ్లు..ఒక అంతర్జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారన్న దృష్టితో మమ్మల్ని చూడకపోయేవాడు.

ఏ స్థానంలో ఆడమని చెప్పేవాడో అర్థంకాకపోయేది

ఏ స్థానంలో ఆడమని చెప్పేవాడో అర్థంకాకపోయేది

ఆటగాళ్లే జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించి స్టార్లుగా వెలుగొందుతారనే విషయాన్ని అతను మర్చిపోయి, కేవలం కోచ్‌కు మాత్రమే గొప్ప పేరు రావాలని చూశాడు. అతని ఆలోచన తీరు అంతుపట్టలేకుండా ఉండేది. జట్టులో ఎప్పుడు ఎవరిని ఏ స్థానంలో ఆడమని చెప్పేవాడో అర్థంకాకపోయేది. మైదానంలో కొన్ని విజయాల్లో అతని ప్రణాళికలు విజయవంతం కావొచ్చు. కానీ కోచ్‌ లేకున్నా కూడా ఆ మ్యాచ్‌ల్లో మేం గెలిచేవాళ్లమే. అతను అనుకున్నదే జరగాలనే మొండి పట్టుదల చూపిస్తాడు.

చాపెల్‌ టీమిండియాను కష్టాల్లో నెట్టి

చాపెల్‌ టీమిండియాను కష్టాల్లో నెట్టి

బ్యాట్స్‌మన్‌గా అతణ్ని గౌరవిస్తా. కానీ కోచ్‌గా అదే మాట చెప్పలేను. మంచి వాతావరణంలో భారత్‌కు వచ్చిన చాపెల్‌ టీమిండియాను కష్టాల్లో నెట్టి వెళ్లాడు. నా క్రికెట్‌ కెరీర్‌లో కఠినమైన రోజులకు అతనే కారణం. ' అని లక్ష్మణ్ అన్నాడు. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు అనూహ్య వీడ్కోలు పలకడంపై కూడా ఈ హైదరాబాదీ తన ఆత్మకథలో పేర్కొన్నాడు. ఎవరి ఒత్తిళ్లు, మాటలకు తలొగ్గకుండా మనసాక్షి ప్రకారమే నడుచుకున్నానని, చివరికి నాన్న చెప్పినా వినకుండా రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, December 3, 2018, 10:14 [IST]
Other articles published on Dec 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X