న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జట్టులో పాతుకుపోవడానికి ఇదే సమయం: విరాట్ కోహ్లీ

Great chance for youngsters to cement their place: Virat Kohli

న్యూ ఢిల్లీ: వెస్టిండీస్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌‌కు టీమిండియాలో చాలా కీలక మార్పులు చేశారు మన సెలక్టర్లు. యువ క్రికెటర్లకు అవకాశమిచ్చి సీనియర్లకు దాదాపు విశ్రాంతినిచ్చారు. మ్యాచ్‌లు మరి కొద్ది రోజుల్లో మొదలుకానున్న సందర్భంగా భారత జట్టుకు ఎంపికైన యువ ఆటగాళ్లకు ఇదే మంచి అవకాశమని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అభిప్రాయపడ్డాడు.

బ్యాటింగ్‌ ఆర్డర్‌ సెట్‌ చేయాలనుకుంటున్నా:

బ్యాటింగ్‌ ఆర్డర్‌ సెట్‌ చేయాలనుకుంటున్నా:

గురువారం రాజ్‌కోట్‌ వేదికగా తొలి టెస్ట్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కోహ్లి మీడియాతో మాట్లాడుతూ.. ‘మేం ఈ సిరీస్‌ను ఓ బెంచ్‌ మార్క్‌గా తీసుకొని మా బ్యాటింగ్‌ ఆర్డర్‌ సెట్‌ చేయాలనుకుంటున్నాం. కొంత మంది యువ ఆటగాళ్లు టాప్‌ ఆర్డర్‌లో భాగంగా ఎంపికయ్యారు. వారికి లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

దేశీవాలీ క్రికెట్‌లో రాణిస్తున్నారు:

దేశీవాలీ క్రికెట్‌లో రాణిస్తున్నారు:

వారికి మంచి అవకాశమని భావిస్తున్నాం. హనుమ విహారి, పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాల్‌లు ఈ సిరీస్‌కు ఎంపికచేశాం. ఎందుకంటే వాళ్లు దేశీవాలీ క్రికెట్‌లో స్థిరంగా రాణిస్తున్నారు. వారు ఒత్తిడికి లోనుకాకుండా తమ వంతు ఎప్పుడు వస్తుందాని ఎదురు చూడాలి. జట్టులో పాతుకుపోవడానికి వారికిదే మంచి అవకాశం'అని కోహ్లి అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్‌ పర్యటన అనంతరం విశ్రాంతి తీసుకున్న కోహ్లి.. ఈసిరీస్‌తో మళ్లీ జట్టుతో కలిసి ఆడనున్నాడు.

అనుమానాలన్నీ పటాపంచలు చేసిన రోహిత్

అనుమానాలన్నీ పటాపంచలు చేసిన రోహిత్

ఆసియా కప్‌లో కోహ్లీ లేకుండా టోర్నీ ఆరంభించాలంటే టీమిండియా ఆడగలదా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. అయితే ఈ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ రోహిత్ శర్మ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు అందుకుని ట్రోఫీని అందించాడు. ఇలా రోహిత్ ట్రోఫీ దక్కించుకోవడం ఇది రెండో సారి. ఇంతకుముందు శ్రీలంక వేదికగా జరిగిన నిదహాస్ ట్రోఫీకి రోహిత్ యే కెప్టెన్. అందులోనూ భారతే విజేత.

రోహిత్‌ను జట్టులోకి తీసుకోకుండా

రోహిత్‌ను జట్టులోకి తీసుకోకుండా

అలాంటి రోహిత్ శర్మను వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌లోనూ జట్టులోకి తీసుకోకుండా విశ్రాంతినివ్వడం సరికాదని పలువురి వాదన. ఇప్పటికే దీనిపై సౌరవ్ గంగూలీ, సునీల్ గవాస్కర్, నిఖిల్ చోప్రా తమ వంతుగా నోరు విప్పారు. గంగూలీ ఈ ఎంపిక పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేయగా సునీల్ పెదవివిరిచి అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Story first published: Wednesday, October 3, 2018, 14:44 [IST]
Other articles published on Oct 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X