న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్ట్ క్రికెట్‌ను సజీవంగా ఉంచగలడు, కోహ్లీ ఓ సూపర్ స్టార్: స్మిత్ ప్రశంస

Graeme Smith feels superstar Virat Kohli can keep Test cricket alive

కోల్‌కతా: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని క్రికెట్‌లో "సూపర్ స్టార్" అని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ప్రశంసల వర్షంతో ముంచెత్తాడు. టెస్టు క్రికెట్‌ను సజీవంగా ఉంచగలిగే ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ముందు వరసలో ఉంటాడని గ్రేమ్ స్మిత్ తెలిపాడు.

ఈ ఏడాది కోహ్లీకి బాగా కలిసొచ్చింది

ఈ ఏడాది కోహ్లీకి బాగా కలిసొచ్చింది

శుక్రవారం(నవంబర్ 2)న కోల్‌‌కతాలో జగ్మోహన్ దాల్మియా వార్షిక కాన్‌క్లేవ్(చాప్టర్ II)లో ఉపన్యాసం చేసిన గ్రేమ్ స్మిత్ "ఈ ఏడాది కోహ్లీకి బాగా కలిసొచ్చింది. వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 10 వేల పరుగులు చేయడం, వరుసగా సెంచరీలు చేసి ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా తన విలువను పెంచుకున్నాడు" అని అన్నాడు.

ప్రపంచ క్రికెట్‌లో సూపర్‌స్టార్ల కొరత ఎక్కువైంది

ప్రపంచ క్రికెట్‌లో సూపర్‌స్టార్ల కొరత ఎక్కువైంది

"ప్రపంచ క్రికెట్‌లో సూపర్‌స్టార్ల కొరత ఎక్కువైంది. ఇంగ్లండ్‌లో ఒకరిద్దరు ఉన్నారు. మిగతా వాళ్లలో విరాట్ కోహ్లీ అతిపెద్ద సూపర్‌స్టార్. టెస్ట్‌లంటే అతనికి ప్రాణం. అద్భుతమైన ప్రదర్శన చేస్తాడు. దేశంలో ఐపీఎల్, టీ20లతో సమానంగా ఈ ఫార్మాట్‌కు ఆదరణ తెస్తున్నాడు. టెస్ట్‌లను విరాట్ కోహ్లీ ప్రమోట్ చేస్తున్నంత కాలం ఎలాంటి ఢోకా లేదు" అని స్మిత్ పేర్కొన్నాడు.

కూకబుర్రా బంతులపై గ్రేమ్ స్మిత్

కూకబుర్రా బంతులపై గ్రేమ్ స్మిత్

ఇక, కూకబుర్రా బంతులను టెస్ట్ క్రికెట్‌ను మరింత ప్రమాదంలో పడేస్తున్నాయని గ్రేమ్ స్మిత్ వెల్లడించాడు. "కూకబుర్రా బంతులు టెస్ట్ క్రికెట్‌ను ప్రమాదంలో పడేస్తున్నాయి. బంతుల నాణ్యత అతి పెద్ద సమస్యగా మారింది. బంతి మృదువుగా ఉండటం వల్ల ఎక్కువ కాలం స్వింగ్‌కు అనుకూలించదు. టెస్ట్ క్రికెట్‌లో బోరింగ్ డ్రా మ్యాచ్‌లను ఎవరూ చూడరు. అందుకే బంతి స్పిన్ తిరుగాలి. గాలిలో భిన్నంగా తిరుగుతూ స్వింగ్ కావాలి. బ్యాట్‌కు, బంతికి మధ్య పోటీ పెరుగాలి. అప్పుడే టెస్ట్ క్రికెట్ సజీవంగా ఉంటుంది" అని స్మిత్ తెలిపాడు.

సఫారీ జట్టు తరుపున 117 టెస్టులాడిన గ్రేమ్ స్మిత్

సఫారీ జట్టు తరుపున 117 టెస్టులాడిన గ్రేమ్ స్మిత్

దక్షిణాఫ్రికాకు చెందిన ఈ మాజీ కెప్టెన్ ఆ జట్టు తరుపున 117 టెస్టులకు ప్రాతినిథ్యం వహించాడు. ఇందులో స్మిత్ 109 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహారించడం విశేషం. వచ్చే నెలలో కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా కోహ్లీసేన నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది.

Story first published: Saturday, November 3, 2018, 10:04 [IST]
Other articles published on Nov 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X