న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గడ్డ కట్టిన మంచుపై సెహ్వాగ్, అఫ్రీదిలతో పాటు గ్రేమ్ స్మిత్

Graeme Smith, Afridi confirmed for Ice Cricket

హైదరాబాద్: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్‌స్మిత్ మళ్లీ క్రికెట్ బ్యాట్ పట్టనున్నాడు. 2016 ఫిబ్రవరి మాస్టర్ ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం గ్రేమ్ స్మిత్ అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు చెప్పాడు. 2018 ఫిబ్రవరి 8,9తేదీలలో జరగనున్న స్విట్జార్లాండ్‌లోని మంచు ప్రాంతమైన సెయింట్ మార్జిజ్ వేదికగా టీ20 మ్యాచ్ జరగనుంది.

సెహ్వాగ్ Vs అక్తర్: గడ్డ కట్టిన సరస్సుపై టీ20 క్రికెట్, భారీ మొత్తంలో ఫీజుసెహ్వాగ్ Vs అక్తర్: గడ్డ కట్టిన సరస్సుపై టీ20 క్రికెట్, భారీ మొత్తంలో ఫీజు

ఈ మ్యాచ్‌కు విరామం అనంతరం గ్రేమ్ స్మిత్ పునరాగమనం చేయబోతున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడ్డకట్టిన సరస్సు మంచు ఉపరితలంపై తొలిసారిగా జరుగుతున్న టీ20 లీగ్‌లో పాల్గొనడానికి ఉత్సాహంగా ఉందని స్మిత్ తెలిపాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన స్మిత్ ఇప్పటివరకు మళ్లీ మైదానంలోకి దిగలేదు.

ఈ టోర్నీలో ఇప్పటికే భారత మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్,కైఫ్, పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రీది, శ్రీలంక మాజీ ఆటగాడు జయవర్ధనే, మలింగ, ఇంగ్లండ్ ఆటగాళ్లు ఒవైస్ షా, పనేసర్, న్యూజిలాండ్ మాజీ ఆటగాడు వెటోరి, ఇలియట్, నాథన్ మెక్‌కల్లమ్ పాల్గొంటున్నారు.

'గతంలో వీరితో చాలా అంతర్జాతీయ క్రికెట్ ఆడాను. ఇప్పుడు ఈ లీగ్ సందర్భంగా వారితో తలపడడం నాకు ఉత్సాహంగా ఉంది' అని స్మిత్ అభిప్రాయపడ్డాడు. రెండురోజుల ఈ లీగ్‌కు ఇప్పటికే ఐసీసీ గుర్తింపు ఇచ్చిందని నిర్వాహక బాధ్యతలు చూస్తున్న వీజే స్పోర్ట్స్ తెలిపింది. అక్కడి ఉష్ణోగ్రత మైనస్ 20 డిగ్రీలు ఉండగా మ్యాటింగ్ పిచ్‌పై ఎర్రబంతితో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇలాంటి వాతావరణంలో మ్యాచ్ జరగడం ఇదే మొదటిసారి కావడంతో అభిమానుల్లో మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, December 26, 2017, 11:53 [IST]
Other articles published on Dec 26, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X