న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియా రెట్రో వరల్డ్‌కప్ కిట్‌తో మోడల్‌గా మారిన మ్యాక్స్‌వెల్

Glenn Maxwell Turns Model For Australias Retro World Cup 2019 Kit

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి ఆరంభమయ్యే వన్డే వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా రెట్రో యూనిఫామ్‌లో బరిలోకి దిగబోతోంది. ఇటీవలే సొంతగడ్డపై జనవరిలో జరిగిన వన్డే సిరిస్‌లో టీమిండియాతో గ్రీన్, గోల్డ్ రంగులు కలిసి ఉన్న జెర్సీలను ధరించిన ఆడిన సంగతి తెలిసిందే. ఈ జెర్సీలను 1986 అలెన్-బోర్డర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా ధరించడం విశేషం.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

కొత్త జెర్సీతో వరల్డ్‌కప్ బరిలోకి ఆస్టేలియా

ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు అతిథ్యమిస్తోన్న ఈ వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా జట్టు ఇదే జెర్సీని ధరించి వరల్డ్‌కప్‌ను ఆడనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈ జెర్సీని ధరించి ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఈ ఫోటోలను క్రికెట్ ఆస్ట్రేలియా తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

18 వన్డేల్లో కేవలం మూడింట మాత్రమే విజయం

18 వన్డేల్లో కేవలం మూడింట మాత్రమే విజయం

బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా కొన్ని నెలలు పాటు కఠిన పరిస్థితులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఆడిన 18 వన్డేల్లో కేవలం మూడింట మాత్రమే విజయం సాధించింది. అయితే, వరల్డ్ కప్‌కు ముందు ఆ జట్టు వరుసగా రెండు వన్డే సిరిస్‌లను కైవసం చేసుకుని ఫామ్‌లోకి వచ్చింది.

వరల్డ్‌కప్‌కు ముందు ఫామ్‌లోకి వచ్చిన ఆస్ట్రేలియా

వరల్డ్‌కప్‌కు ముందు ఫామ్‌లోకి వచ్చిన ఆస్ట్రేలియా

ఇటీవలే పాకిస్థాన్‌తో ముగిసిన ఐదు వన్డేల సిరిస్‌ను ఆరోన్ ఫించ్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేయగా... అంతకముందు భారత క్రికెట్ జట్టుతో జరిగిన ఐదు వన్డేల సిరిస్‌ను 3-2తో కైవసం చేసుకుంది. 2009 తర్వాత భారత గడ్డపై ఆస్ట్రేలియా నెగ్గిన తొలి వన్డే సిరిస్ ఇదే కావడం విశేషం. పాక్‌తో జరిగిన ఐదు వన్డేల సిరిస్‌లో ఉస్మాన్ ఖవాజా ఫామ్‌లోకి వచ్చాడు.

అందుబాటులోకి స్మిత్, వార్నర్

అందుబాటులోకి స్మిత్, వార్నర్

మరోవైపు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై విధించిన నిషేధం ముగియడంతో వీరిద్దరూ కూడా వరల్డ్‌కప్‌ జట్టులో తిరిగి చోటు దక్కించుకొనే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రపంచకప్ బరిలో దిగే జట్టుని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక, బీసీసీఐ ఏప్రిల్ 15వ తేదీన భారత జట్టుని ప్రకటించనుంది.

Story first published: Tuesday, April 9, 2019, 18:05 [IST]
Other articles published on Apr 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X