న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అఫ్రిది సంచలన వ్యాఖ్యలు: గట్టి పంచ్ ఇచ్చిన గౌతమ్ గంభీర్

By Nageshwara Rao
Gautam Gambhir's Befitting Reply To Shahid Afridi, Fans Fight On Twitter
Gautam Gambhir terms Shahid Afridi’s Kashmir comments as ‘retarded’

హైదరాబాద్: గౌతమ్ గంభీర్.. మిగతా క్రికెటర్లతో పోలిస్తే కాస్త దేశభక్తి ఎక్కువ. సరిహద్దుల్లో ఎన్నోసార్లు పాక్ దుశ్చర్యలపై అతడు స్పందించాడు. తాజాగా పాక్ క్రికెటర్ అఫ్రిది కశ్మీర్ అంశంపై చేసిన సంచలన వ్యాఖ్యలపై గౌతమ్ గంభీర్ తనదైన శైలిలో స్పందించాడు.

అఫ్రిది వ్యాఖ్యలను అంతగా పట్టించుకోనక్కరలేదని, అతను నోబాల్‌తో వికెట్‌ తీసి సంబరాలు చేసుకుంటున్నాడని గంభీర్ గట్టిగా పంచ్ ఇచ్చాడు. 'అఫ్రిది ట్వీట్‌పై నన్ను స్పందించాల్సిందిగా మీడియా అడిగింది. దీనిపై ఏం స్పందించాలి? బుద్ధిమాంద్యం ఉన్న అతని దృష్టిలో యూఎన్ అంటే అండర్ 19 అని అర్థం. మీడియా దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అఫ్రిది నోబాల్‌తో వికెట్‌ తీసి ఆనందపడుతున్నాడు.' అని వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు.

అఫ్రిదికి గంభీర్‌ మధ్య మాటల యుద్దం తొలిసారేం కాదు. గతంలో ఎన్నో సార్లు వీరి మధ్య మాటల యుద్దం నడించింది. 2011 వరల్డ్ కప్ విజయానంతరం గంభీర్‌ తన విజయాన్ని ముంబై దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారకి అంకితం చేశాడు. ఈ వ్యాఖ్యలను అఫ్రిది తప్పుబట్టగా.. గంభీర్‌ తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చాడు.

ఆదివారం కశ్మీర్‌లో భారత బలగాలు 13 మంది టెర్రరిస్టులను మట్టుబెడితే.. ఇండియా ఆక్రమిత కశ్మీర్‌లో అమాయకులను అణచివేస్తున్నారంటూ అఫ్రిది ట్విటర్‌లో ప్రశ్నించాడు. 'భారత్‌ ఆక్రమించిన కశ్మీర్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. అణచివేత పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం తమ గళాన్ని వినిపిస్తున్న అమాయక ప్రజలు అన్యాయంగా తుపాకీ తూటాలకు బలైపోతున్నారు. ఈ హింసను ఐక్యరాజ్యసమితి, ఇతర స్వచ్ఛంద సంస్థలు ఎందుకు అడ్డుకోలేకపోతున్నాయి' అని ట్వీట్‌ చేశాడు.

అఫ్రిది వ్యాఖ్యలపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2017లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అఫ్రిది పాకిస్థాన్ తరఫున 27 టెస్టులు, 398 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. 2011 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొన్న పాకిస్థాన్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.

Story first published: Tuesday, April 3, 2018, 19:47 [IST]
Other articles published on Apr 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X