న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Team India : నువ్వు ఉమ్రాన్ కాదు.. ప్రాబ్లం సాల్వ్ చేసుకోకుంటే కష్టమే.. యువపేసర్‌కు సలహా!

Gambhir takes on Arshdeep Singh Issues

టీమిండియా యువ పేసర్లలో ఉమ్రాన్ మాలిక్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రత్యర్థి బ్యాటర్లను ఆశ్చర్యపరిచే పేస్ అతని సొంతం. అందుకే అతను ఆడుతుంటే ఆట ఎగ్జయిటింగ్‌గా ఉంటుందని చాలా మంది మాజీ లెజెండ్స్ కొనియాడుతుంటారు. అలాగే ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న మహమ్మద్ సిరాజ్ కూడా మంచి బౌలరే. ఉమ్రాన్ వేసినట్లు 150+ కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయలేడు కానీ.. 145+ కిలోమీటర్ల వేగంతో అయినా వేయగలడు. ఇదే విషయాన్ని మాజీ లెజెండ్ గౌతం గంభీర్ కూడా గుర్తుచేశాడు.

అరంగేట్రం అదుర్స్

అరంగేట్రం అదుర్స్

ఉమ్రాన్ కాకుండా గతేడాది టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన మరో పేసర్ అర్షదీప్ సింగ్. ఈ ఎడం చేతి వాటం పేసర్ గతేడాది అద్భుతంగా రాణించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అరంగేట్రం చేసిన అతను.. 2022లో మొత్తం 21 మ్యాచుల్లో 33 వికెట్లు తీసుకొని రాణించాడు. టీ20 వరల్డ్ కప్‌లో కూడా బుమ్రా వంటి సీనియర్ పేసర్ లేని లోటును పూడ్చటంలో తన వంతు పాత్ర పోషించాడు. ఆ మెగా టోర్నీలో 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అతని భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని, టీమిండియాకు జహీర్ ఖాన్ తర్వాత మరో మంచి ఎడం చేతి వాటం స్పిన్నర్ దొరికాడని అనుకున్నారు.

తేలిపోతున్న అర్షదీప్..

తేలిపోతున్న అర్షదీప్..

ఇటీవలి కాలంలో అతని ఆటతీరు చాలా మారిపోయింది. ధారాళంగా పరుగులు ఇవ్వడమే కాకుండా ఎడతెరిపి లేకుండా నోబాల్స్ వేస్తున్నాడు. ఇది అతని అతి పెద్ద సమస్య అని గంభీర్ అన్నాడు. అర్షదీప్ తన బౌలింగ్‌లో వేరియేషన్స్ తెచ్చుకోవాలని సూచించాడు. 'నువ్వు ఉమ్రాన్ మాలిక్, మహమ్మద్ సిరాజ్ కాదు. కాబట్టి బౌలింగ్‌లో వేరియేషన్స్ తెచ్చుకోవాలి. అలా చేయకపోతే అతని బౌలింగ్ గణాంకాలు అయితే అద్భుతంగా ఉంటాయి. లేదంటే పరమచెత్తగాా ఉంటాయి' అని గంభీర్ వివరించాడు.

నోబాల్స్ గురూజీ..

నోబాల్స్ గురూజీ..

కొన్ని రోజుల క్రితం శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ చూసిన ఎవరూ అర్షదీప్‌ను మర్చిపోరు. ఎందుకంటే ఆ సిరీస్ రెండో టీ20లో అతను ఏకంగా ఐదు నోబాల్స్ వేశాడు. క్రికెట్ చరిత్రలో మరే భారత బౌలర్ కూడా ఒక మ్యాచ్‌లో ఇన్ని నోబాల్స్ వేయలేదు. తాజాగా కివీస్‌తో జరిగిన తొలి టీ20లో కూడా చివరి ఓవర్లో బంతి అందుకొని 27 పరుగులు ఇచ్చాడు. ఆ ఓవర్ తొలి బంతికే నోబాల్ వేశాడు. ఇది చూసిన చాలా మంది మాజీలు అర్షదీప్ బౌలింగ్‌లో నోబాల్స్ పెద్ద సమస్య అని తేల్చిచెప్పాడు. గంభీర్ కూడా ఈ విషయంపై అర్షదీప్ ఫోకస్ పెట్టాలని, ఇది చాలా ముఖ్యమని చెప్పాడు. మరి అతను ఏం చేస్తాడో చూడాలి.

Story first published: Wednesday, February 1, 2023, 11:22 [IST]
Other articles published on Feb 1, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X