న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కాంట్రాక్ట్: రహానేకు ప్రమోషన్, రైనాకు డిమోషన్

By Nageswara Rao

ముంబై: 2015-16 సంవత్సరానికి గాను ఆటగాళ్ల కాంట్రాక్ట్‌ల జాబితాను సోమవారం బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐ ప్రకటించిన తాజా కాంట్రాక్ట్ జాబితాలో అజ్యింకా రహానే ఏ-గ్రేడ్‌లో చోటు దక్కించుకున్నాడు.

ఇటీవల కాలంలో పేలవమైన ఫామ్‌లో కొనసాగుతున్న సురేష్ రైనాను ఏ-గ్రేడ్ నుంచి తొలగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఏ- గ్రేడ్‌ను దక్కించుకున్న ఆటగాళ్లలో మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, రవిచంద్రన్ అశ్విన్‌లు ఉన్నారు.

అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ ధోని ఏ-గ్రేడ్‌లో ఉండటం గమనార్హం. ఏ-గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు బీసీసీఐ రూ. కోటి ఇస్తున్న సంగతి తెలిసిందే. 2014-15 సంవత్సరంలో ధోనీ, విరాట్ కోహ్లీ, సురేష్ రైనాలతో పాటు భువనేశ్వర్ కుమార్‌లకు ఏ-గ్రేడ్ దక్కిన విషయం తెలిసిందే.

భువనేశ్వర్ కుమార్‌ని బీ-గ్రేడ్‌కు తగ్గిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. బీ-గ్రేడ్ ఆటగాళ్లకు బీసీసీఐ రూ. 50 లక్షలు చెల్లిస్తుంది. గత రెండేళ్లుగా బీసీసీఐ కాంట్రాక్టుని దక్కించుకోని టీమిండియా ఆఫ్ స్ఫిన్నర్ హార్భజన్ సింగ్ ఈ ఏడాది మాత్రం సీ-గ్రేడ్ దక్కించుకున్నాడు.

Full list of BCCI's contracted players for 2015-16; Rahane in Grade A


2015-16 సంవత్సరానికి గాను ఏ-గ్రేడ్ దక్కించుకున్న ఆటగాళ్లు:

ఏ-గ్రేడ్ (రూ. కోటి)- 4 (గతేడాది 5): ధోని, విరాట్ కోహ్లీ, అశ్విన్, రహానే

ఇన్: రహానే, ఔట్: సురేష్ రైనా, భువనేశ్వర్ కుమార్

బీ-గ్రేడ్ (రూ. 50 లక్షలు)- 10 (గతేడాది 11): సురేష్ రైనా, అంబటి రాయుడు, రోహిత్ శర్మ, మురళీ విజయ్, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఛటేశ్వర్ పుజారా, మహ్మద్ షమీ.

ఇన్: రైనా, భువనేశ్వర్ కుమార్ ఔట్: ఓజా, రవీంద్ర జడేజా

సీ-గ్రేడ్(రూ. 25 లక్షలు) - 12 (గతేడాది 16): అమిత్ మిశ్రా, అక్షర పటేల్, స్టువర్ట్ బిన్నీ, వృద్ధిమాన్ సాహా, మోహిత్ శర్మ, వరుణ్ ఆరోన్, కర్ణ్ శర్మ, రవీంద్ర జడేజా, KL రాహుల్, ధావల్ కులకర్ణి, హర్భజన్ సింగ్, ఎస్ అరవింద్.

ఇన్: జడేజా, హార్భజన్ సింగ్, ఎస్ అరవింద్ ఔట్: ఆర్ వినయ్ కుమార్, రాబిన్ ఉతప్ప, కుల్దీప్ యాదవ్, సంజు సామ్సన్, మనోజ్ తివారీ, పర్వేజ్ రసూల్, పంకజ్ సింగ్

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X