న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

UP నుంచి కర్ణాటక వరకు: దేశ రాజకీయాల్లో క్రీడాకారుల ప్రభావం?

By Nageshwara Rao
From Karnataka to UP: Sportsmen who turned to politics

హైదరాబాద్: సర్వత్రా ఆసక్తిని రేకెత్తించిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు రానేవచ్చాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వచ్చిన నేపథ్యంలో దేశంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికల ఫలితాల్లో అక్కడి ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వకపోవడంతో హంగ్ ఏర్పడింది.

దీంతో అధికార పీఠం ఎవరికి దక్కుతుందనే విషయంపై ఇంతవరకూ స్పష్టత రాలేదు. 104 స్థానాలతో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. కానీ 78 సీట్లు దక్కించుకున్న కాంగ్రెస్‌, 38 స్థానాల్లో విజయం పొందిన జేడీఎస్‌ పార్టీలు ఒక్కటై ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చాయి.

అతి పెద్ద పార్టీనే తొలుత ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని అటు బీజేపీ అంటుండగా, మరోవైపు తమకు కావాల్సిన మద్దతు ఉన్నందున తమనే ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలని కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి అంటోంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడ్డాయి.

ఈ క్రమంలో పార్టీలు కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు కోసం రిసార్ట్ రాజకీయాలు మొదలు పెట్టాయి. అయితే, ఏ పార్టీని పిలవాలనే దానిపై ఆ రాష్ట్ర గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మంగళవారం వెలువడిన కర్ణాటక అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ 104 స్థానాలు గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది.

ఇక, కాంగ్రెస్‌ 78, జేడీ(ఎస్‌) 38, ఇతరులు 2 స్థానాలు గెలుచుకున్నారు. రాష్ట్రంలోని 224 స్థానాలకు గానూ 222 స్థానాలకు ఈనెల 12న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. గతంలో పలువురు క్రీడాకారులు కూడా రాజకీయ నాయకులుగా మారారు. వారెవరో ఒక్కసారిగా చూద్దామా...

బైచుంగ్ భూటియా

బైచుంగ్ భూటియా

భారత మాజీ పుట్‌బాల్ కెప్టెన్. తొలుత తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆ పార్టీకి రాజీనామా చేసి ఈ ఏడాది ఏప్రిల్‌లో తానే సొంతంగా 'హమ్రో సిక్కిం' అనే రాజకీయ పార్టీని స్థాపించారు.

దొడ్డ గణేష్

దొడ్డ గణేష్

కర్ణాటకకు చెందిన దొడ్డ గణేష్ మాజీ క్రికెటర్. 1990 దశకంలో టీమిండియా తరుపున నాలుగు టెస్టులు, ఒక వన్డే ఆడాడు. దేశవాళీ క్రికెట్‌లో కర్ణాటక రంజీ జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు. భారత మాజీ ప్రధాని దేవేగౌడకు చెందిన జేడీ(ఎస్) పార్టీలో చేరారు.

ఏథెన్స్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో భారత్‌కు

ఏథెన్స్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో భారత్‌కు

సిల్వర్ పతకం అందించాడు. ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర క్రీడల మంత్రిగా కొనసాగుతున్నారు. కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో భాగంగా ఇటీవలే రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌కు I&B మంత్రిగా కూడా బాధ్యతలు అప్పగించారు.

 నవజ్యోత్ సింగ్ సిద్ధూ

నవజ్యోత్ సింగ్ సిద్ధూ

టీమిండియా మాజీ క్రికెటర్ అయిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కొన్నాళ్లపాటు కామెంటేటర్‌గా విధులు నిర్వహించారు. పంజాబ్‌‌కు చెందిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రస్తుతం కెప్టెన్ అమరీందర్ సింగ్ మంత్రి వర్గంలో టూరిజం శాఖ మంత్రిగా ఉన్నారు.

మహమ్మద్ అజహరుద్దీన్

మహమ్మద్ అజహరుద్దీన్

మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంతో టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ క్రికెట్ కెరీర్ ముగిసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయనాయకుడిగా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్ పార్లమెంటరీ నియోకవర్గం నుంచి 2009, 2014లో ఎంపీగా పోటీ చేశారు. 2009లో ఎంపీగా గెలిచినప్పటికీ, 2014లో మాత్రం బీజేపీకి చెందిన తన ప్రత్యర్ధి కున్వర్ సర్వేష్ కుమార్ చేతిలో 50,000 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

ఎమ్ఏ పటౌడీ

ఎమ్ఏ పటౌడీ

టీమిండియా లెజెండరీ మాజీ కెప్టెన్ నవాబ్ పటౌడీ రెండుసార్లు తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 1971లో విశాల్ హర్యానా పార్టీ నుంచి గురుగ్రామ్ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత 1991లో కాంగ్రెస్‌లో చేసి భోపాల్ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. అయితే, ఈ రెండు సార్లు ఆయన ఓటమి పాలయ్యారు.

మహమ్మద్ కైఫ్

మహమ్మద్ కైఫ్

నాట్ వెస్ట్ ట్రోఫీలో భారత్‌కు అద్భుతమైన విజయాన్ని అందించిన మహమ్మద్ కైఫ్ కూడా రాజకీయాల్లోతన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఉత్తర ప్రదేశ్ నుంచి పుల్పూర్ ఎంపీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపు నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. దీంతో రాజకీయాలకు స్వస్తి చెప్పి ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో కోచ్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

Story first published: Wednesday, May 16, 2018, 16:22 [IST]
Other articles published on May 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X