న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అర్ధం కావట్లేదు: ఇంగ్లాండ్‌కు కొరికరాని కొయ్యగా కుల్దీప్ యాదవ్!

By Nageshwara Rao
Kuldeep Yadav Is Lucky Says England Batsmen
From cement wickets to turning tracks, Kuldeep Yadav lucky with chances

హైదరాబాద్: కోహ్లీసేన ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. మూడు టీ20ల సిరిస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. గురువారం నుంచి మూడు వన్డేల సిరిస్ ప్రారంభమైంది. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య ఇంగ్లాండ్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

భారత విజయంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన కుల్దీప్ యాదవ్ 6 వికెట్లు తీసి 25 పరుగులిచ్చాడు. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు నానా ఇబ్బందులు పడ్డారు.

తొలి టీ20లో ఐదు వికెట్లు సమర్పించుకున్న ఇంగ్లాండ్

తొలి టీ20లో ఐదు వికెట్లు సమర్పించుకున్న ఇంగ్లాండ్

తొలి టీ20లో కుల్దీప్‌కు ఐదు వికెట్లు సమర్పించుకున్న ఇంగ్లాండ్ జట్టు.. గురువారం రాత్రి జరిగిన తొలి వన్డేలో ఏకంగా ఆరు వికెట్లు సమర్పించుకుంది. ఇదే తడబాటు శనివారం లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగే రెండో వన్డేలో కూడా కొనసాగితే వన్డే సిరిస్‌ను కూడా చేజార్చుకోకతప్పదు.

ఇప్పటికే టీ20 సిరిస్‌ను చేజార్చుకున్న ఇంగ్లాండ్

ఇప్పటికే టీ20 సిరిస్‌ను చేజార్చుకున్న ఇంగ్లాండ్

కుల్దీప్ బౌలింగ్ అర్ధం కాక ఇప్పటికే టీ20 సిరిస్‌ను చేజార్చుకుంది. ఇప్పుడు వన్డే సిరిస్... ఆ తర్వాత జరగనున్న టెస్టు సిరీస్‌ను కూడా వదులుకోవాల్సి వస్తుందేమో? అని ఇంగ్లాండ్‌ జట్టు కంగారు పడుతోంది. తొలి టీ20 ముగిసిన తర్వాత కుల్దీప్‌‌ను ఎదుర్కొనేందుకు మెర్లిన్‌ అనే బౌలింగ్ మెషిన్‌ను ఇంగ్లాండ్‌ రంగంలోకి దింపింది.

మెర్లిన్‌ అనే బౌలింగ్ మెషిన్‌ను సైతం రంగంలోకి

మెర్లిన్‌ అనే బౌలింగ్ మెషిన్‌ను సైతం రంగంలోకి

ఈ బౌలింగ్ మెషిన్‌‌తో ప్రాక్టీస్ చేయడంతో రెండో టీ20లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ కుల్దీప్ బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొవడమే కాదు... విజయం కూడా సాధించారు. గతంలో.. ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్ షేన్‌వార్న్‌ని ఎదుర్కొనేందుకు ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్ ఈ బౌలింగ్ మిషన్ సాయంతో ప్రాక్టీస్ చేశారు.

 స్వీప్‌ షాట్లతో వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్

స్వీప్‌ షాట్లతో వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్

ఇప్పుడు ఈ బౌలింగ్ యంత్రం కూడా కుల్దీప్ యాదవ్ నుంచి ఇంగ్లాండ్‌ను కాపాడలేకపోతోంది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ గతంలో ఇలానే కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఇబ్బందిపడినప్పటికీ... స్వీప్, రివర్స్ స్వీప్స్‌‌తో విరుగుడు కనిపెట్టారు. కానీ ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్ స్వీప్‌ షాట్ ఆడుతున్నా వికెట్లను కోల్పోతున్నారు.

లార్డ్స్ వేదికగా శనివారం నుంచి రెండో వన్డే

లార్డ్స్ వేదికగా శనివారం నుంచి రెండో వన్డే

గురువారం రాత్రి జరిగిన తొలి వన్డేలో జేసన్ రాయ్, బెన్‌స్టోక్స్ రివర్స్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించే కుల్దీప్ యాదవ్‌కి వికెట్లు సమర్పించుకున్నారు. దీంతో ఇంగ్లాండ్ జట్టుకి కుల్దీప్ యాదవ్ కొరకరాని కొయ్యగా మారాడు. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య శనివారం లార్డ్స్ వేదికగా జరగనున్న రెండో వన్డే అత్యంత కీలకంగా మారనుంది.

Story first published: Friday, July 13, 2018, 16:18 [IST]
Other articles published on Jul 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X