న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాలీవుడ్‌ టు ఐపీఎల్‌ ఒప్పందం వరకు: ఎవరీ దిగ్విజయ్‌ దేశ్‌ముఖ్‌?

From Bollywood to IPL 2020 contract: Kai Po Che child actor Digvijay Deshmukh ready to realise cricket dream with MI

హైదరాబాద్: ఆరేళ్ల క్రితం అతడు ఓ బాలీవుడ్ సినిమాలో నటించాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు ఒక్కసారిగా క్రికెట్ బ్యాట్ పట్టి పరుగుల వరద పారించాడు. దీంతో గురువారం కోల్‌కతా వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో లక్షలు పలికాడు. అతడే 'కాయ్‌ పో చె' సినిమాలో బాల క్రికెటర్‌గా నటించిన దిగ్విజయ్‌ దేశ్‌ముఖ్‌.

కనీస ధర రూ.20 లక్షలతో వేలంలోకి వచ్చిన దిగ్విజయ్ దేశ్‌ముఖ్‌ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్‌లో వచ్చే ఏడాది ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడనున్నాడు. మహారాష్ట్ర తరఫున ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఈ ఏడాదే అరంగేట్రం చేసిన దిగ్విజయ్‌ దేశ్‌ముఖ్‌ ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఆరు వికెట్లతో సత్తాచాటాడు.

రూ.10.75 కోట్లు ఇచ్చిన ఉత్సాహం: 39 బంతుల్లో 83 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్రూ.10.75 కోట్లు ఇచ్చిన ఉత్సాహం: 39 బంతుల్లో 83 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలోనూ 9 వికెట్లతో రాణించడంతో ముంబై ఇండియన్స్‌ రూ.20 లక్షలకు దిగ్విజయ్‌ను సొంతం చేసుకుంది. 2013లో విడుదలైన కాయ్‌ పో చె చిత్రంలో అలీ పాత్రలో దిగ్విజయ్‌ బ్యాట్‌ పట్టుకుని కనిపించాడు. అయితే, ఇప్పుడు అంతర్జాతీయ ఆటగాళ్లతో కలిసి డ్రెస్సింగ్‌రూమ్‌ను పంచుకునే అవకాశం లభించింది.

నాలుగు సార్లు ఐపీఎల్ ఛాంపియన్స్‌గా

నాలుగు సార్లు ఐపీఎల్ ఛాంపియన్స్‌గా

నాలుగు సార్లు ఐపీఎల్ ఛాంపియన్స్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ వచ్చే సీజన్ కోసం గట్టి ప్రణాళికతో వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసింది. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు వేలంలో క్రిస్ లిన్‌ను రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన ఈ క్రికెటర్ గత సీజన్లలో కేకేఆర్‌కు ఆడాడు.

క్రిస్ లిన్‌ను వేలంలో

ఫించ్ హిట్టర్‌గా పేరొందించిన క్రిస్ లిన్‌ను వేలంలో కనీసధర రూ. 2 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత వేలంలో సౌరభ్‌ తివారీ(రూ. 50 లక్షలు), దిగ్విజయ్ దేశ్‌ముఖ్‌(రూ. 20 లక్షలు), ప్రిన్స్‌ బల్వంత్‌రాయ్‌(రూ. 20 లక్షలు), మోహ్‌సిన్‌ ఖాన్‌(రూ. 20 లక్షలు)లను ముంబై కొనుగోలు చేసింది.

ముంబై ఇండియన్స్ పూర్తి జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా, క్వింటన్ డి కాక్, కీరోన్ పొలార్డ్, లసిత్ మలింగ, మిచెల్ మెక్‌క్లెనాగన్, క్రునాల్ పాండ్యా, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, రాహుల్ చాహర్, అన్మోల్‌ప్రీత్ సింగ్, జయంత్ యాదవ్ అనుకుల్ రాయ్, నాథన్ కౌల్టర్-నైలు, క్రిస్ లిన్, మొహ్సిన్ ఖాన్, దిగ్విజయ్ దేశ్ముఖ్, సౌరభ్ తివారీ, ప్రిన్స్ బల్వంత్ రాయ్ సింగ్, ధావల్ కులకర్ణి, ట్రెంట్ బౌల్ట్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్

వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్ళు:

నాథన్ కౌల్టర్-నైలు, క్రిస్ లిన్, మొహ్సిన్ ఖాన్, దిగ్విజయ్ దేశ్ ముఖ్, సౌరభ్ తివారీ, ప్రిన్స్ బల్వంత్ రాయ్ సింగ్

వేలంలో ఖర్చు చేసిన మొత్తం

వేలానికి ముందు ముంబై ఇండియన్స్ వద్ద ఉన్న మొత్తం నగదు రూ. 13.05 కోట్లు. ఈ సీజన్‌ కోసం నిర్వహించిన వేలంలో అత్యల్ప నగదు ఉన్న ప్రాంఛైజీ ముంబైనే. గురువారం జరిగిన వేలంలో మొత్తం ఆరుగురు ఆటగాళ్ల కోసం డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ రూ.11.2 కోట్లు ఖర్చు చేసింది.

Story first published: Saturday, December 21, 2019, 8:28 [IST]
Other articles published on Dec 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X