న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సామ్యూల్స్‌పై ఒత్తిడి వద్దనే, ఆ 4 సిక్స్‌లు ఇలా..: బ్రాత్‌వైట్

By Srinivas

కోల్‌కతా: ప్రపంచ ట్వంటీ 20 2016 కప్ వెస్టిండీస్ ఖాతాలో పడటం వెనుక కార్లోస్ బ్రాత్ వైట్ పాత్ర మరువలేనిది. చివరి ఓవర్లో 19 పరుగులు చేయాల్సిన తరుణంలో నాలుగు వరుస బంతుల్లో నాలుగు సిక్స్‌లు కొట్టి ఇంగ్లాండ్ బౌలర్ స్టోక్స్‌కు జీవితాంతం గుర్తుంచే చేదును మిగిల్చాడు.

అదే సమయంలో విండీస్‌కు కప్ సాధించి పెట్టాడు. దీనిపై బ్రాత్ వైట్ మాట్లాడాడు. బ్రాత్ వైట్ మాట్లాడుతూ.. తాను హార్డ్ హిట్టింగ్‌కు ముందే సిద్ధమయ్యానని చెప్పాడు. ఆఖరి ఓవర్ కావడంతో ఆ సమయంలో సామ్యూల్స్ పైకి ఒత్తిడి నెట్టకుండా తానే రిస్క్ తీసుకొని హిట్టింగ్ చేసినట్లు చెప్పాడు.

20వ ఓవర్‌కు ముందు నేను, సామ్యూల్స్ మాట్లాడుతున్నామని, ఏది ఏమైనా బంతులను వృథా చేయవద్దని నిర్ణయించుకున్నామని, తొలి బంతిని కనీసం హిట్ చేస్తే పరుగు తీస్తానని సామ్యూల్స్ చెప్పాడని, అయితే ఆ క్లిష్ట సమయంలో సింగిల్స్ తీసి సామ్యూల్స్‌కు స్టైకింగ్ ఇచ్చి అతనిని ఒత్తిడిలోకి నెట్ట దల్చుకోవాలనుకున్నానన్నాడు.

Four balls, four sixes: Brathwaite blasts Windies to dramatic World T20 final win

బంతిని క్షుణ్ణంగా పరిశీలించి బలంగా బాదాలని నిర్ణయించుకున్నానని, చావో రేవే తేల్చుకోవాలనుకున్నానని చెప్పాడు. మూడు సిక్సర్లు కొట్టిన సమయంలో మా విజయానికి ఒక పరుగు మాత్రమే అవసరమనే విషయం తనకు గుర్తున్నప్పటికీ ఆ మరుసటి బంతిని బౌండరీకి దాటిస్తేనే మేలని భావించానని చెప్పాడు.

ఆ సమయంలో రనౌట్ అయితే మ్యాచ్ చేజారిపోయే ప్రమాదం ఉందని తాను భావించానని చెప్పాడు. వరుస నాలుగు బంతుల్లో సిక్సులు కొట్టిన బ్రాత్ వైట్ పైన అందరూ ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. వరుసగా నాలుగు సిక్సులు ఎలా ప్లాన్ వేసుకొని కొట్టింది కూడా బ్రాత్ వైట్ చెప్పాడు.

చివరి ఓవర్‌కు ముందు శామ్యూల్స్‌ తన వద్దకొచ్చి ఏదేమైనా సరే నేను పరుగెత్తుతాను, నువ్వు బంతి స్టేడియం దాటేలా బాదమని చెప్పాడని, ప్రతి బంతికీ వీలైనన్ని పరుగులు సాధించాలనే ఉద్దేశంతో ఉన్నామని, ఆఖరి ఓవర్లో తొలి బంతి కాస్త లెగ్‌సైడ్‌ పడగానే దానిని గాల్లో లేపేశానని, బౌండరీ దూరమున్న వైపు వెళ్లిందోమేనని కాస్త కంగారు పడ్డానని చెప్పాడు. శామ్యూల్స్‌ పరుగెత్తుకొచ్చి అభినందించాడని చెప్పాడు.

Four balls, four sixes: Brathwaite blasts Windies to dramatic World T20 final win

ఆ తర్వాత రెండో బంతి.. బౌలర్ స్టోక్స్‌ అనుకున్న స్థానంలో బంతిని వేయలేకపోయాడనిపించిందని, నేను కాస్త వంగాల్సి వచ్చిందని, అయితే కచ్చితంగా భారీ షాట్ కొట్టాల్సిందేనని భావించి, బాదేశానని, అది జనాల్లో పడటం చూసి మేం విజయానికి చేరువవుతున్నామని అర్థమైందన్నాడు. అప్పుడు ఉద్వేగం కలిగిందన్నాడు.

మూడో బంతి సమయంలో.. బంతిని బ్యాట్‌తో తాకించాలి, పరుగెత్తాలని ఇద్దరం భావించామని, బంతిని బాదాను కానీ.. అది బ్యాట్‌కు సరిగ్గా తాకలేదని, అయినా బంతి బౌండరీ అవతల పడిందని, బౌలర్ స్టోక్స్‌ మంచి బంతే వేశాడు.. కానీ సిక్సర్‌ కొట్టానని, నేను బాదిన వాటిలో ఇదే అత్యుత్తమ సిక్సర్ అని బ్రాత్ వైట్ చెప్పాడు.

నాలుగో బంతికి ఇక ఆలస్యం చేయకూడదనుకుని నిర్ణయించుకున్నానని, ఎలాగైనా బంతిని బాదాల్సిందేనని భావించానని, ఫీల్డర్లందరూ దగ్గరగా ఉండటంతో బంతి వాళ్లను దాటితే కప్పు మా సొంతమని భావించి, బంతిని జాగ్రత్తగా గమనించి బాదానని చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని, మా వాళ్లు నాలుగు సిక్సర్లు భలే కొట్టావని చెప్పేవరకు.. చివరి బంతి కూడా బౌండరీ అవతలపడిందని అర్థం కాలేదన్నాడు. సంతోషం, ఉద్వేగంలో మతి పోయిందని, దానిని మాటల్లో వర్ణించలేనని చెప్పాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X