న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మాంచెస్టర్ విమానాశ్రయంలో వసీం అక్రమ్‌కు అవమానం!!

Felt Embarrassed And Humiliated At Manchester Airport: Wasim Akram || Oneindia Telugu
Former Pakistan captain Wasim Akram embarrassed and humiliated at Manchester airport

మాంచెస్టర్‌: మాంచెస్టర్ విమానాశ్రయంలో తనకి అవమానం ఎదురైందని పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ వసీం అక్రమ్‌ మంగళవారం ట్విట్టర్ వేదికగా తెలిపాడు. డయాబెటిస్‌కు సంబంధించి ఇన్సులిన్‌ విషయంలో విమానశ్రయ సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించారని, ప్రయాణికుల ముందే తనపై గట్టిగా అరిచారని అక్రమ్‌ తన ఆవేదన వ్యక్తం చేశాడు.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

చాలా నిరుత్సాహాపడ్డా:

'ఈరోజు మాంచెస్టర్‌ విమానాశ్రయంలో జరిగిన సంఘటనతో చాలా నిరుత్సాహాపడ్డా. నేను నా ఇన్సులిన్‌ సంచితో ప్రపంచ వ్యాప్తంగా పర్యటిస్తున్నాను. కానీ.. నేను ఎప్పుడూ ఇలా ఇబ్బంది పడలేదు. విమాన సిబ్బంది అమర్యాదగా ప్రశ్నించడంతో అవమానంగా అనిపించింది. ఇన్సులిన్‌ విషయంలో ప్రయాణికుల ముందే గట్టిగా అరిచారు. ఇన్సులిన్‌ను కోల్డ్‌ కేస్‌ నుంచి తీసి ప్లాస్టిక్‌ సంచిలో పెట్టారు' అని అక్రమ్‌ ట్వీట్‌ చేశాడు.

విచారణ చేపడతాం:

వసీం అక్రమ్‌ ట్వీట్‌కు మాంచెస్టర్‌ ఎయిర్‌పోర్టు ఉన్నతాధికారులు స్పందించారు. 'ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు వసీం. దీనిపై విచారణ చేపడతాం. మీరు నేరుగా ఫిర్యాదు చేస్తే మరింత సమాచారం తీసుకోగలం' అంటూ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు అన్నారు.

ప్రత్యేక గౌరవం కోరుకోవట్లేదు:

ప్రత్యేక గౌరవం కోరుకోవట్లేదు:

'అందరిలో నాకు ప్రత్యేక గౌరవం ఇవ్వాలని కోరుకోవట్లేదు. కానీ మర్యాదగా ప్రవర్తించాలని అంటున్నా. భద్రతా కారణాల దృష్ట్యా అలా వ్యవహరించారని అర్థం చేసుకున్నా. కానీ అవమానించే రీతిలో చేయకూడదు' అని అక్రమ్‌ మరో ట్వీట్‌ చేశాడు.

916 వికెట్లు:

916 వికెట్లు:

తాజాగా ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో వసీం అక్రమ్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. టోర్నీ ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణంలో అక్రమ్‌కు ఈ అవమానం జరిగింది. 104 టెస్టులు, 356 వన్డేలు ఆడినే అక్రమ్‌.. మొత్తం 916 వికెట్లు తీసాడు. పాక్‌ సాధించిన అనేక విజయాల్లో అక్రమ్‌ కీలక పాత్ర పోషించాడు.

Story first published: Wednesday, July 24, 2019, 10:43 [IST]
Other articles published on Jul 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X