న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ-గంభీర్ మధ్య అదో చెత్త గొడవ: కేకేఆర్ మాజీ ప్లేయర్

Former KKR player Rajat Bhatia opens up ugly spat between Virat Kohli and Gautam Gambhir in IPL 2013

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఓ మ్యాచ్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మైదానంలో మాట మాట పెరిగి ఈ ఢిల్లీ ఆటగాళ్లు ఇద్దరు ఒకరిపైకి మరొకరు దూసుకెళ్లారు. ఐపీఎల్ 2013 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఓ మ్యాచ్ సందర్భంగా ఈ గొడవ నెలకొంది.

కోహ్లీని కవ్వించడంతో..

కోహ్లీని కవ్వించడంతో..

ఔటై పెవిలియన్‌కి వెళ్తున్న విరాట్ కోహ్లీ‌పై గౌతమ్ గంభీర్ కవ్వింపులకు దిగాడు. దీంతో.. సహనం కోల్పోయిన విరాట్.. గంభీర్‌తో వాగ్వాదానికి దిగగా.. ఇద్దరూ దాదాపు కొట్టుకునేలా ఒకరిపైకి ఒకరు దూసుకొచ్చారు. అయితే.. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో నాటి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు రజత్ భాటియా మధ్యలోకి వచ్చి ఇద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అంపైర్లు కూడా కలగజేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. కానీ తీవ్ర చర్చనీయాంశమైంది.

ఇద్దరూ..ఇద్దరే..

ఇద్దరూ..ఇద్దరే..

ఇక ఆ గొడవపై తాజాగా రజత్ భాటియా స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విరాట్-కోహ్లీల అదో చెత్త గొడవని తెలిపాడు. ‘విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్.. ఇద్దరూ దూకుడుగా ఉండే కెప్టెన్లు. తాము ప్రాతినిథ్యం వహిస్తున్న జట్లకు విజయాల్ని అందించాలని అనుక్షణం పరితపించే వ్యక్తులు. కాబట్టి ఇద్దరి మధ్య జరిగిన ఆ గొడవను మ్యాచ్‌లో భాగంగానే చూడాలి. కానీ వారు దూషించుకున్న తీరు మాత్రం చాలా చెత్తగా ఉంది. అయితే ఆ గొడవ తర్వాత ఎప్పుడూ వారు మైదానంలో అలా గొడవపడటం నేను చూడలేదు'రజత్ భాటియా తెలిపాడు.

కోహ్లీ పరుగుల ఆకలే..

కోహ్లీ పరుగుల ఆకలే..

ఇక ప్రస్తుత తరంలో కోహ్లీ బెస్ట్ బ్యాట్స్‌మన్ అని రజత్ భాటియా కొనియాడాడు. పరుగులు చేయాలనే అతని తపనే విరాట్ సక్సెస్‌కు కారణమన్నాడు. ‘ఎప్పుడూ పరుగులు చేయాలని పరితపించడం కోహ్లీలోని గొప్ప విషయం. అతని పరుగులు ఆకలి ఎప్పటికీ తీరదు. అదే అతన్ని అగ్ర బ్యాట్స్‌మన్‌‌గా నిలబెట్టింది. అతని ఆట ఆగదని కోహ్లీకి తెలుసు'అని రజత్ భారత కెప్టెన్‌ను కొనియాడాడు.

 ఆర్సీబీ విజయం..

ఆర్సీబీ విజయం..

ఇక గొడవ జరిగిన నాటి మ్యాచ్‌లో కోహ్లీ సారథ్యంలోని ఆర్సీబీనే 8 వికెట్లతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గంభీర్ నేతృత్వంలోని కోల్‌కతా 154 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గంభీర్ (46 బంతుల్లో 59) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇక లక్ష్యచేధనలో ఆర్సీబీ.. క్రిస్ గేల్ సూపర్ (50 బంతుల్లో 85) సూపర్ ఇన్నింగ్స్‌కు విరాట్ (35) సూపర్ ఇన్నింగ్స్ తోడవడంతో 15 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని అందుకొని విజయం సాధించింది. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు కెప్టెన్‌గా గౌతమ్ గంభీర్ రెండు సార్లు టైటిల్స్ అందించగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఒక్కసారి కూడా కోహ్లీ విజేతగా నిలపలేకపోయాడు. ఇప్పటికీ.. కోహ్లీ కెప్టెన్సీ గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. ఐపీఎల్ టైటిల్‌ గెలవలేకపోయాడంటూ గంభీర్ ఎద్దేవా చేస్తుంటాడు.

హార్దిక్ పాండ్యా ప్రేయసి నటాషా బికినీ ఫొటో వైరల్

Story first published: Thursday, July 2, 2020, 8:10 [IST]
Other articles published on Jul 2, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X