Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హార్దిక్ పాండ్యా ప్రేయసి నటాషా బికినీ ఫొటో వైరల్

Hardik Pandya Fiance Natasa Stankovic Shares Throwback Bikini Pic


ముంబై :
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా కాబోయే భార్య, సినీనటి నటాషా స్టాన్‌కోవిచ్ ఓ త్రోబ్యాక్ బికినీ ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకొని నెటిజన్లను ఆకట్టుకుంది. సముద్ర తీరాన బ్లాక్ బికినీలో కెమెరాకు ఫోజిచ్చిన ఈ సెర్బియా బ్యూటీ అందాలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. దీంతో ఈ హాట్ ఫోటో నెట్టింట హల్‌చల్ చేస్తుంది.

మంచి విటమిన్ సీ డోస్ కావాలి..

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ ఫొటోను షేర్ చేసిన నటాషా.. ‘నాకు కావాల్సింది మంచి విటమన్ సీ (విటమిన్ సముద్రం) డోస్ 'అని క్యాప్షన్‌గా పేర్కొంది. సెర్బియా మోడల్, సినీనటి అయిన నటాషా బిగ్ బాస్ 8తో వినోదరంగంలోకి అడుగుపెట్టింది. నటాషా ‘సత్యాగ్రహ', ‘ఫుక్రీ రిటర్న్స్' చిత్రాల్లో డ్యాన్స్ సన్నివేశాల్లో కనిపించింది.

పెళ్లి కాకుండానే పేరెంట్స్..

పెళ్లి కాకుండానే పేరెంట్స్..

ఇక కొత్త ఏడాది సందర్బంగా నిశ్చితార్ధం చేసుకున్నామని ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసిన హార్దిక్-నటాషా జోడీ.. లాక్‌డౌన్‌లో త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనున్నామని వెల్లడించారు. అయితే ఈ జంట దండలు మార్చుకున్న ఫొటో ఒకటి వైరల్ కాగా.. వీరి పెళ్లిపై మాత్రం స్పష్టత లేదు. ప్రస్తుతానికైతే పెళ్లికాకుండానే పేరెంట్స్ అయ్యారని అందరూ భావిస్తున్నారు. ‘మా జీవితాల్లో కొత్త జీవితానికి స్వాగతం పలికేందుకు మేమిద్దరం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాం. మా జీవితంలోని కొత్త దశలో అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. మీ అందరి ఆశీర్వాదం, దీవెనలు కావాలి. నటాషాతో నా ప్రయాణం గొప్పగా సాగుతోంది. మున్ముందు మా బంధం మరింత బలపడుతుంది' అని హార్దిక్‌ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు.

నీ ముఖంలో ఈ గ్లో ఎక్కడిదమ్మా..

నీ ముఖంలో ఈ గ్లో ఎక్కడిదమ్మా..

ఇటీవల తన ప్రేయసి, కాబోయే భార్య నటాషా స్టాన్‌కోవిచ్‌‌‌పై పొగడ్తల వర్షం కురిపించిన హార్దిక్... ఆమెతో ఉన్న ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ నటాషా అందాన్ని కొనియాడాడు. 'హే నటాషా.. నీ ముఖంలో ఈ గ్లో ఎక్కడిదమ్మా'అని చిలిపిగా ప్రశ్నించాడు.

 హార్దిక్ నీ ప్రేమే..

హార్దిక్ నీ ప్రేమే..

దీనికి నటాషా కూడా చాలా క్యూట్‌గా సమాధానమిచ్చింది. తన సౌందర్యం క్రెడిట్ అంతా హార్దిక్‌దేనని తెలుపుతూ.. ‘హార్దిక్.. నీ ప్రేమ వాత్సల్యమే నా ముఖంలోని గ్లోకు కారణం' అని అంతే చిలిపిగా బదులిచ్చింది. ఇన్‌స్టా వేదికగా వీరి మధ్య నడిచిన కామెంట్ల ప్రేమయానానికి అభిమానులు ఫిదా అయ్యారు. ‘లవ్లీ కపుల్.. సో క్యూట్' అంటూ కామెంట్ చేస్తున్నారు.

కరోనాతోనే చస్తున్నామంటే మరొకటి తయారు చేసారంట: హర్భజన్ ఫైర్

Story first published: Wednesday, July 1, 2020, 10:01 [IST]
Other articles published on Jul 1, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+