న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌పై నిప్పులు చెరిగిన గంభీర్‌

Former Cricketer Gautam Gambhir Serious Comments On Rishabh pant
IND vs SA: Frustrated Rishabh Pant Enters SA Dressing Room | Oneindia Telugu

జోహ‌న్నెస్‌బ‌ర్గ్‌: సౌతాఫ్రికాతో రెండో టెస్టు మ్యాచ్‌లోని సెకండ్ ఇన్నింగ్స్‌లో నిర్ల‌క్ష్య‌పు షాట్‌తో ఔటైన టీమిండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌పై ఇంటా బ‌య‌ట విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. సునీల్ గ‌వాస్క‌ర్, ఆకాశ్ చోప్రా వంటి దిగ్గ‌జాలు ఇప్ప‌టికే పంత్ ఆడిన విధానాన్ని ఖండించారు. తాజాగా మాజీ క్రికెట‌ర్, లోక్ స‌భ ఎంపీ గౌతం గంభీర్ సైతం రిష‌బ్ పంత్ బ్యాటింగ్ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పంత్ ఔటైనా విధానం ప‌ట్ల తాను నిరాశ చెందాన‌నే ప‌దం చాలా త‌క్కువ‌ని చెప్పుకొచ్చారు.

అస‌లు టెస్టు క్రికెట్ ఆడేది ఇలా కాద‌ని అన్నారు. పంత్ వ‌చ్చి రాగానే భారీ షాట్ ఆడ‌కుండా, జ‌ట్టుకు విలువైన ప‌రుగులు చేసి ఉంటే సంతోషించే వాడిన‌ని గంభీర్ తెలిపారు. అస‌లు టెస్టు క్రికెట్ ఎలా ఆడాలో ద‌క్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గ‌ర్‌ను చూసి నేర్చుకోవాల‌ని ఆయ‌న సూచించారు. అదే స‌మ‌యంలో గ‌తంలో కేప్‌టౌన్ టెస్టు మ్యాచ్‌లో తాను, స‌చిన్ టెండూల్క‌ర్.. దిగ్గ‌జ పేస‌ర్లు డేల్ స్టెయిన్, మోర్నీ మోర్కెల్‌ను ఎదుర్కొని ఎలా మంచి స్కోర్ సాధించామో గుర్తు చేసుకున్నారు. ఆ ఇన్నింగ్స్‌లో ఇద్ద‌రం క‌లిసి మంచి భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పామ‌ని, అలాగే స‌చిన్ రికార్డు సెంచ‌రీ సాధించ‌డాని గౌతీ నెమ‌రు వేసుకున్నారు.

అలాగే ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్ డ‌స్సెల్‌ బ్యాటింగ్ చేస్తుండ‌గా అత‌నిపై వికెట్ల వెనుకాల పంత్ స్లెడ్జింగ్‌కు దిగిన‌ట్లు తెలిసింద‌ని గంభీర్ తెలిపారు. అయితే ఇత‌రుల‌పై స్లెడ్జింగ్‌కు పాల్ప‌డ‌డం చాలా తేలిక‌ని, కానీ మ‌నం బ్యాటింగ్ చేసే స‌మ‌యంలో అలాంటివి ఎదుర్కొవడం క‌ష్టంతో కూడిన ప‌ని గౌతం గంభీర్ అన్నారు. కాగా బుధ‌వారం జ‌రిగిన మూడో రోజు ఆట‌లో కేవలం మూడు బంతులే ఎదుర్కొని నిర్ల‌క్ష్యంగా భారీ షాట్ రిష‌బ్‌పంత్ డ‌కౌట్ అయిన సంగ‌తి తెలిసిందే.

ఈ టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ముందు టీమిండియా 240 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది. ఈ క్ర‌మంలో మూడో రోజు ఆట ముగిసే స‌మయానికి సౌతాఫ్రికా 2 వికెట్లు కోల్పోయి 118 ప‌రుగులు చేసింది. విజ‌యానికి మ‌రో 122 ప‌రుగుల దూరంలో ఉండిపోయింది. భార‌త్ నెగ్గాలంటే సౌతాఫ్రికా బ్యాట‌ర్ల‌ను అడ్డుకోని 8 వికెట్లు తీయాలి. దీంతో నాలుగో రోజు ఆట‌పై అంతటా ఆస‌క్తి నెల‌కొంది. కానీ నాలుగో రోజు ఆట‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క బంతి కూడా ప‌డ‌లేదు. నేడు ఉద‌యం నుంచి జోహ‌న్నెస్‌బ‌ర్గ్‌లో వ‌ర్షం కురుస్తోంది.

Story first published: Thursday, January 6, 2022, 17:15 [IST]
Other articles published on Jan 6, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X