న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మరోసారి ఐసీసీ ఛైర్మన్‌గా శశాంక్ ఏకగ్రీవ ఎన్నిక

 Former BCCI president Shashank Manohar elected unopposed as ICC chairman for second term

హైదరాబాద్: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శశాంక్‌ మనోహర్‌ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) స్వతంత్ర చైర్మన్‌గా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండేళ్ల క్రితం తొలిసారి ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికైన మనోహర్‌.. రెండోసారి కూడా తానే ఆ బాధ్యతను స్వీకరించనున్నట్లు ఐసీసీ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఆయనను ఏకగీవ్రంగా ఎన్నుకున్నట్లు ఐసీసీ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

ఐసీసీ కౌన్సిల్ ఆమోద ముద్ర వేయడంతో బోర్డు డైరెక్టర్లందరూ మనోహర్ ఎన్నికను ఏకగ్రీవంగా ఆమోదించారు. అతని నియామకం వెంటనే అమల్లోకి రానుంది. 2016లో మొదటిసారి ఐసీసీ తొలి స్వతంత్ర చైర్మన్‌గా ఏకగీవ్రంగా ఎన్నికైన మనోహర్‌ పదవీ కాలం ఇటీవలే ముగిసింది. కాగా, మనోహర్‌ను మరోసారి ఎన్నుకుంటూ ఐసీసీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది.

ఈ విషయానికి బోర్డు డైరెక్టర్లందరూ ఏకగీవ్రంగా ఆమోదం తెలపడంతో మనోహర్‌ తిరిగి చైర్మన్‌గా నియమితులయ్యారు. దాంతో మరో రెండేళ్ల పాటు ఐసీసీ చైర్మన్‌ హోదాలో మనోహర్‌ కొనసాగనున్నారు. తనను ఐసీసీ చైర్మన్‌గా రెండోసారి ఎన్నుకోవడంపై మనోహర్‌ కౌన్సిల్‌ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.


మనోహర్‌ ఐసీసీ డైరెక్టర్లు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఏ రకంగా అయితే పని చేశానో, అదే తరహాలో పని చేస్తానని హామీ ఇచ్చారు. రాబోవు రెండేళ్ల కాలంలో ఐసీసీని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానన‍్నారు.
Story first published: Tuesday, May 15, 2018, 18:51 [IST]
Other articles published on May 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X