న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'విరాట్ లాంటి ఆటగాళ్లు అరుదు.. ఇలాంటి వాళ్లు క్రికెట్‌కి కావాలి'

Former Australian captain Allan Border said world cricket needs more characters like Virat Kohli

హైదరాబాద్: పెర్త్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో కోహ్లీ అమితోత్సాహంతో కనిపించాడు. ఒకానొక సందర్భంలో ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైనెతో వివాదానికి కూడి దిగేలా కనిపించాడు. దాంతో పాటుగా వికెట్ తీసిన సందర్భాల్లో కోహ్లీ సెలబ్రేట్ చేసుకునే తీరు చూసి ఆసీస్ ఆటగాళ్లతో పాటు అందరూ విమర్శలు గుప్పించారు. ఇవన్నీ కేవలం ఆటపై అభిరుచిని తెలిపే అంశాలేనని అలాంటి వాళ్లు దొరకడం అరుదని ఆసీస్ మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ అంటున్నాడు. ఈ క్రమంలో మైదానంలో అభిరుచి ప్రదర్శించే కోహ్లీ తరహా క్రికెటర్లు అవసరమని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్‌ బోర్డర్‌ పేర్కొన్నారు.

 విరాట్ అందరికంటే భిన్నంగా

విరాట్ అందరికంటే భిన్నంగా

విరాట్‌ దూకుడుతత్వంతో పెర్త్‌లో చేసుకున్న సంబరాలకు మద్ధతుగా నిలిచారు. ‘ప్రస్తుతం మన ఆటలో విభిన్న మనస్తత్వాలున్న క్రికెటర్లు కనిపించడం లేదు. అందరూ ఒకే తరహాలో ఉంటున్నారని వ్యాఖ్యానించాడు. ఆసీస్‌తో రెండో టెస్టులో విరాట్‌ అతి భావోద్వేగంతో చేసుకున్న సంబరాలు చూసి మైక్‌ హస్సీ, మిచెల్‌ జాన్సన్‌, సంజయ్‌ మంజ్రేకర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.

చూడడానికి కాస్త అతిగా అనిపించినా

చూడడానికి కాస్త అతిగా అనిపించినా

‘తన జట్టు కేవలం ఒక వికెట్‌ తీసినా దూకుడుగా సంబరాలు చేసుకునే వ్యక్తిని చూడలేదు. ఇది చూడడానికి కాస్త అతిగా అనిపించొచ్చు. కానీ అది మంచిదే. అతడి ప్రయత్నాల్లో మనం అంతులేని అభిరుచిని చూడొచ్చు. విదేశాల్లో సిరీస్‌ గెలవాలని విరాట్‌ కోరుకుంటున్నాడు. ప్రపంచ నంబర్‌ వన్‌ జట్టు ప్రదర్శనకు అవి కీలక సూచనలు. జట్టు అగ్రస్థానానికి చేరింది. ఇప్పుడు ఒక కెప్టెన్‌గా విదేశాల్లో కూడా జట్టుని గెలిపించడం చాలా కీలకం. విరాట్‌ దీనిని అనుభూతి చెందుతున్నాడు'

మిగతా ఆటగాళ్లంతా నిశ్శబ్దంగా

మిగతా ఆటగాళ్లంతా నిశ్శబ్దంగా

'టీమిండియాలో అతడిలా దూకుడుగా ఉండేవాళ్లు కనిపించడం అరుదు. భారత జట్టులో మిగతా ఆటగాళ్లంతా చాలా మంచి క్రికెటర్లు. కానీ నిశ్శబ్దంగా ఉంటారు. ఒక సారథిగా కోహ్లీ జట్టును ముందుండి నడిపించి అభిరుచి ప్రదర్శించాలి. అతడిలో అది సహజంగా ఉంది' అని బోర్డర్‌ అన్నాడు.

Story first published: Friday, December 21, 2018, 11:23 [IST]
Other articles published on Dec 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X