న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫ్లోరిడాలో తొలి టీ20: భారత్ Vs విండిస్ మ్యాచ్‌కి పొంచి ఉన్న వర్షం ముప్పు!

India VS West Indies 2019 : Will Rain Play A Spoilsport In 1st T20I..? || Oneindia Telugu
Florida Weather Forecast, India vs West Indies: Will rain play a spoilsport in 1st T20I?

హైదరాబాద్: ప్రపంచకప్‌ తర్వాత మూడు వారాల పాటు మైదానానికి దూరంగా ఉన్న టీమిండియా మళ్లీ సమరానికి సిద్ధమైంది. వెస్టిండిస్ పర్యటనలో భాగంగా అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా తొలి టీ20కి సన్నద్ధమైంది. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా మొదటి రెండు టీ20లకు ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్ ఆతిథ్యమిస్తోంది.

తొలి టీ20: బాబర్ అజాం, కోహ్లీ రికార్డును కేఎల్ రాహుల్ బద్దలు కొట్టేనా?తొలి టీ20: బాబర్ అజాం, కోహ్లీ రికార్డును కేఎల్ రాహుల్ బద్దలు కొట్టేనా?

ఇక, ఆగస్టు 6న జరిగే మూడో టీ20 గుయానాలో జరగనుంది. కాగా తొలి రెండు టీ20లకు ఆతిథ్యమిస్తోన్న సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం పిచ్‌ బ్యాటింగ్‌కు స్వర్గధామం. ఇంతకుముందు వెస్టిండిస్‌తో ఇక్కడ జరిగిన టీ20లో వెస్టిండీస్‌ ఏకంగా 245 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ స్టేడియంలోనే కేఎల్ రాహుల్(110) మెరుపు సెంచరీ చేశాడు.

దీంతో టీమిండియా లక్ష్యానికి చేరువగా వచ్చినప్పటికీ.. కేవలం ఒక్క పరుగు తేడాతో మ్యాచ్ ఓడిపోయింది. ఇదిలా ఉంటే శనివారం నాటి మ్యాచ్‌కి వర్షం ముప్పు ఉండటం క్రికెట్ అభిమానులను ఆందోళన కలిగిస్తోంది. శనివారం ఆట ప్రారంభానికి ముందు ఉదయం ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.

క్రిస్ గేల్ సుడిగాలి ఇన్నింగ్స్: ఒక ఓవర్‌లో 6-6-4-4-6-6 (వీడియో)క్రిస్ గేల్ సుడిగాలి ఇన్నింగ్స్: ఒక ఓవర్‌లో 6-6-4-4-6-6 (వీడియో)

ఆకాశం అంతా మేఘావృతమై ఉంది. MET విభాగం కూడా మధ్యాహ్నం ఉరుములతో కూడిన వర్షాన్ని అంచనా వేయడం విశేషం. ఒకవేళ మ్యాచ్‌కు అవకాశం ఉంటే టాస్‌ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌కు దిగే అవకాశం ఉంది. అందుకు కారణం ఈ స్టేడియంలో జరిగిన 8 టీ20ల్లో ఆరుసార్లు తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టే నెగ్గింది.

విండిస్ పర్యటనకు సెలక్టర్లు ఆల్ రౌండర్ హార్దిక్‌ పాండ్యాకు విశ్రాంతినివ్వగా.. ధోనీ రెండు నెలలుపాటు ఆర్మీకి సేవలందించడం కోసం క్రికెట్‌కు దూరమయ్యాడు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని పరిమిత ఓవర్లలో భారత సెలెక్టర్లు యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చారు.

జో రూట్ లక్కీ: బంతి బెయిల్స్‌ను తాకినా కింద పడలేదు (వీడియో)జో రూట్ లక్కీ: బంతి బెయిల్స్‌ను తాకినా కింద పడలేదు (వీడియో)

రాహుల్‌ చాహర్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, నవ్‌దీప్‌ సైనీ, దీపక్‌ చాహర్‌, వాషింగ్టన్‌ సుందర్‌ వంటి యువ ఆటగాళ్ల ప్రదర్శనను పరిశీలించనున్నారు. ఇదిలా ఉంటే, టీ20ల్లో టీమిండియా ప్రదర్శన ఏమంత గొప్పగా లేదు. న్యూజిలాండ్ పర్యటనలో 1-2తో సిరీస్‌ కోల్పోగా.. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరిస్‌లో 0-2తో చిత్తుగా ఓడింది.

Story first published: Saturday, August 3, 2019, 15:35 [IST]
Other articles published on Aug 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X