న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పెర్త్ టెస్టుపై ఫిక్సింగ్ ఆరోపణలు: క్రికెట్ ఆస్ట్రేలియా ఏం చెప్పిందంటే!

By Nageshwara Rao
 Fixing allegations 'of serious concern' to Cricket Australia

హైదరాబాద్: యాషెస్ టెస్టు సిరిస్‌ను ఎంతగానో ప్రేమించే అభిమానులకు ఇది నిజంగా చేదువార్త. పెర్త్ వేదికగా గురువారం ప్రారంభమైన మూడో టెస్టుపై ఫిక్సింగ్ ఆరోపణలు రావడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. పెర్త్ టెస్టుకు సంబంధించిన కీలక సమాచారాన్ని ది సన్ పత్రికకు చెందిన అండర్ కవర్ రిపోర్టర్ కొనుగోలు అవకాశంపై ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్ సీరియస్‌గా తీసుకుంది.

ఈ విషయంపై విచారణకు ఆదేశించినట్లు ఐసీసీ అధికారిక ప్రకటన చేసింది. పెర్త్ టెస్టు ఫిక్సింగ్ ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్నామని దీనిపై విచారణకు ఆదేశించామని ఐసీసీ మీడియా ప్రకటనలో పేర్కొంది. ది సన్ పత్రిక రిపోర్టుపై క్రికెట్ ఆస్ట్రేలియా కూడా దృష్టి సారించింది.

England Cricket 'fortunate to have invaluable' senior players - Root

పెర్ట్ టెస్టుపై మీడియా చేసిన ఆరోపణను తీవ్రంగా పరిగణిస్తు్న్నామని క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో పేర్కొంది. ఫిక్సింగ్‌తో క్రికెట్‌ను నాశనం చేయాలని చూస్తే ఏ ఒక్కరినీ ఉపేక్షించబోమని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. ఈ విచారణలో ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్‌కు తమ పూర్తి సహాకారం అందిస్తామని తెలిపింది.

ఆస్ట్రేలియాలో జరిగే అన్ని అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు గాను ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్‌తో కలిసి పనిచేస్తున్నామని ప్రకటనలో పేర్కొంది. ఆటగాళ్లకు ఏదైనా అనుమానం కలిగినట్లైతే నేరుగా క్రికెట్ ఆస్ట్రేలియాకు ఫిర్యాదు చేసే సౌలభ్యం ఉందని, అది ఆస్ట్రేలియా ఆటగాళ్ల క్రికెట్ కల్చర్ అని అందులో పేర్కొంది.

పెర్త్ టెస్టు ఫిక్సింగ్ ఆరోపణలపై ఇంగ్లాండ్‌ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా స్పందించింది. ఫాక్స్ స్పోర్ట్స్‌కి ఇచ్చిన ఇంటర్యూలో ఈసీబీ కూడా ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్‌తో కలిసి పనిచేస్తోందని, జెంటిల్మెన్ గేమ్ అయిన క్రికెట్‌ను కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని తెలిపింది.

ఈ ఫిక్సింగ్ ఆరోపణలు గురించి తెలిసిందని, అయితే ఈ ఫిక్సింగ్ ఆరోపణలతో ఇంగ్లాండ్ క్రికెటర్లకు ఎలాంటి సంబంధం లేదని బోర్డు తేల్చి చెప్పింది. ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. మూడో టెస్టు పెర్త్ వేదికగా గురువారం ప్రారంభమైంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, December 14, 2017, 9:52 [IST]
Other articles published on Dec 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X