న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్‌కు వీడ్కోలు: అలెస్టర్ కుక్ కెరీర్‌లో ఐదు గ్రెటేస్ట్ మూమెంట్స్

By Nageshwara Rao
Five Greatest Moments of Alastair Cooks Career

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా సెప్టెంబర్ 7(శుక్రవారం) నుంచి భారత్‌తో మొదలయ్యే చివరి టెస్టే తన కెరీర్‌లో చివరి మ్యాచ్‌.

మోస్ట్ సక్సెస్‌పుల్ టెస్టు బ్యాట్స్‌మన్: అనూహ్యంగా టెస్టుల్లోకి కుక్ అరంగేట్రంమోస్ట్ సక్సెస్‌పుల్ టెస్టు బ్యాట్స్‌మన్: అనూహ్యంగా టెస్టుల్లోకి కుక్ అరంగేట్రం

తన రిటైర్మెంట్‌పై కుక్ మాట్లాడుతూ "రిటైర్మెంట్ ప్రకటించడం బాధాకరమే అయినా నేను క్రికెట్ కోసం అన్నీ ఇచ్చానన్న సంతృప్తి నాకు ఉంది. నేను ఎప్పుడూ ఊహించని రికార్డులను సాధించాను. ఇంగ్లండ్ జట్టులో ఇంతకాలంగా నేను ఆడటం ఎంతో సంతోషంగా.. గౌరవంగా ఉంది. ఇక కొందరు జట్టు సభ్యులతో డ్రెస్సింగ్ రూంని పంచుకోలేను అని తెలిసి కాస్త బాధగా ఉంది. కానీ ఇందుకు ఇదే సరైన సమయం" అని కుక్ చెప్పాడు.

టెస్టుల్లో రికార్డులివే: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అలెస్టర్ కుక్టెస్టుల్లో రికార్డులివే: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అలెస్టర్ కుక్

"నేను పిల్లాడిగా మా గార్డెన్‌లో క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి క్రికెట్ అంటే నాకు ప్రాణం. ఇంగ్లండ్ షర్ట్‌ని తీసేయం చాలా కష్టమే.. కానీ భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని, యువ క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు దక్కాలనే ఇది చేస్తున్నాను. వాళ్లు మా దేశానికి ప్రతినిధ్యం వహించి మనల్ని మరింత అలరించాలని కోరుకుంటున్నా'' అని కుక్ తెలిపాడు.

ఇంగ్లాండ్ తరుపున 161 టెస్టులు ఆడిన అలెస్టర్ కుక్‌ 44.88 సటుతో 12,254 పరుగులు సాధించాడు. ఇందులో 32 సెంచరీలు, 56 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2011లో బర్మింగ్‌హామ్‌లో భారత్‌పై 294 పరుగులు అతడి వ్యక్తిగత అత్యధిక పరుగులు కావడం విశేషం. రిటైర్మెంట్ సందర్భంగా కుక్ కెరీర్‌లో గ్రేటేస్ట్ మూమెంట్ మీకోసం...

2010-11 యాషెస్ సిరిస్‌లో

2010-11 యాషెస్ సిరిస్‌లో

రెండు దశాబ్దాల తర్వాత యాషెస్ సిరిస్‌లో ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకోవడంలో అలెస్టర్ కుక్ కీలకపాత్ర పోషించాడు. ఏకంగా 766 పరుగులు సాధించి 24 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై యాషెస్‌ సిరీస్‌ (2010-11)ను గెలిపించాడు. కుక్ టెస్టు కెరీర్‌లోనే ఇదొక అద్భుతమైన ఘట్టం. ఈ యాషెస్ సిరిస్‌లో అడిలైడ్ టెస్టులో 135, సిడ్నీ టెస్టులో చేసిన 189 పరుగుల ఇన్నింగ్స్‌లు కుక్ టెస్టు కెరీర్‌లోనే ఆణిముత్యాలు. అడిలైడ్ టెస్టులో కుక్ ఏకంగా 1,022 నిమిషాల పాటు క్రీజులో ఉండటం మరో విశేషం.

2012లో భారత్‌లో పర్యటనలో

2012లో భారత్‌లో పర్యటనలో

2012లో భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుకు కుక్ కెప్టెన్‌గా వ్యవహారించాడు. కెప్టెన్‌గా భారత గడ్డపై 2-1తేడాతో టెస్టు సిరిస్‌ను గెలిచి చరిత్ర సృష్టించాడు. ఈ పర్యటనలో అలెస్టర్ కుక్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ జట్టు సమిష్టి ప్రదర్శన చేసింది. ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ చెలరేగాడు. ఇక, బౌలర్లు జేమ్స్ ఆండర్సన్, స్టీవ్ ఫిన్ ఉపఖండంలో అత్యుత్తమ ప్రదర్శన చేశారు. ఈ సిరిస్‌లో కుక్ సైతం 562 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కుక్ కోల్‌కతాలో చేసిన 190 పరుగులు అతడి కెరీర్‌లోనే ఉత్తమ ఇన్నింగ్స్‌గా నిలిచిపోతుంది.

2004-05లో సఫారీలపై టెస్టు సిరిస్ విజయం

2004-05లో సఫారీలపై టెస్టు సిరిస్ విజయం

సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాపై టెస్టు సిరిస్ గెలవడం అన్నది ఎంతో మంది కెప్టెన్ల కల. ఎందుకంటే అక్కడి బౌన్సీ పిచ్‌లు పర్యాటకు జట్టుకు ఎంతమాత్రం అనుకూలం కాదు. అలాంటిది కుక్ కెప్టెన్సీలోని ఇంగ్లాండ్ జట్టు 2004-05లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లాండ్ జట్టు 2-1తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ సిరిస్‌లో ఇంగ్లాండ్ జట్టు టాపార్డర్ చక్కటి భాగస్వామ్యాలను నమోదు చేసి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. ఇక, ఇంగ్లాండ్ బౌలర్లు సైతం సఫారీ బ్యాట్స్‌మెన్లను క్రీజులో కుదురుకోకుండా చేశారు. వాండరర్స్ స్టేడియంలో స్టువర్ట్ బ్రాడ్ చేసిన ప్రదర్శన గురించి ఇప్పటికీ క్రికెట్ విశ్లేషకులు చర్చింకుంటూనే ఉంటారు.

2012లో పాకిస్థాన్‌పై 3-0తో టెస్టు సిరిస్ విజయం

2012లో పాకిస్థాన్‌పై 3-0తో టెస్టు సిరిస్ విజయం

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరిగిన ఈ టెస్టు సిరిస్‌లో ఆతిథ్య పాకిస్థాన్‌పై ఇంగ్లాండ్ జట్టు 3-0తో టెస్టు సిరిస్‌ను కైవసం చేసుకుంది. పాకిస్థాన్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న తొలి టెస్టులో అలెస్టర్ కుక్ క్రీజులో సుమారు 14 గంటల పాటు ఉన్నాడు. కుక్ చేసిన 263 పరుగులు పాక్‌పై 75 పరుగుల ఆధిక్యం సాధించడంలో కీలకపాత్ర పోషించాయి. ఈ మ్యాచ్‌లో బౌలర్ అదిల్ రషీద్ విజృంభించడంతో ఇంగ్లాండ్‌ విజయం సాధించింది.

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో డబుల్ సెంచరీ

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో డబుల్ సెంచరీ

2017-18 యాషెస్ సిరిస్‌లో భాగంగా జరిగిన నాలుగో టెస్టుకు మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమిచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 327 పరుగులకే ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టులో అలెస్టర్ కుక్ డబుల్ సెంచరీతో చెలరేగడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ టెస్టులో ఆసీస్ బౌలర్లను కుక్ ఎదుర్కొన్న తీరు నిజంగా అద్భుతం. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు స్కోరుబోర్డుని పరిగెత్తిస్తూ డబుల్ సెంచరీ నమోదు చేశాడు. దీంతో కుక్ కెరీర్‌లోనే ఈ ఇన్నింగ్స్ అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా నిలిచింది.

Story first published: Tuesday, September 4, 2018, 15:24 [IST]
Other articles published on Sep 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X