న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓపిక పట్టండి: ఆరోన్ ఫించ్ ఫామ్‌పై లాంగర్, కెప్టెన్సీపై ప్రశంస

Finch will come good, just need to be patient, says Langer

హైదరాబాద్: గత కాలంగా పేలవ ఫామ్‌లో కొనసాగుతున్న ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌కు ఆ జట్టు హెడ్ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ మద్దతుగా నిలిచాడు. భారత్‌తో శనివారం నుంచి ఆరంభమయ్యే వన్డే సిరిస్‌తో ఆరోన్ ఫించ్ మళ్లీ తన మునుపటి ఫామ్‌ అందుకుంటాడని కోచ్‌ జస్టిన్‌ లాంగర్ ధీమా వ్యక్తం చేశాడు. ఆటగాడిగా పరుగులు చేయడంలో ఆరోన్ ఫించ్ విఫలమవుతున్నా... కెప్టెన్‌గా మాత్రం ఆకట్టుకుంటున్నాడని జస్టిన్ లాంగర్ వెల్లడించాడు.

నెట్స్‌లో ధోనికి గాయం: హైదరాబాద్ వన్డేకి దూరమేనా!నెట్స్‌లో ధోనికి గాయం: హైదరాబాద్ వన్డేకి దూరమేనా!

భారత్‌తో ముగిసిన టీ20 సిరిస్‌లో ఆరోన్ ఫించ్ తొలి టీ20లో డకౌట్ కాగా, రెండో టీ20లో 8 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ "ఆరోన్ ఫించ్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ అన్న సంగతి మనకు తెలుసు. ప్రస్తుతం ఫామ్‌ లేడు. కానీ అతను ఎంతో విలువైన ఆటగాడు. అతడు ఫామ్‌ అందుకుంటాడని మాకు తెలుసు" అని అన్నాడు.

"ఫామ్‌లో లేని అతనికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఇతడిని మించిన విధ్వంసకర ఆటగాడు మరొకరు లేరు. మాక్స్‌వెల్‌, మార్కస్‌ స్టొయినిస్‌ ఇంకా మరికొందరు విధ్వంసక బ్యాట్స్‌మెన్‌ ఉన్నారు. ఒకసారి ఫించ్‌ రాణించడం మొదలు పెడితే అతన్ని ఆపడం కష్టం. అతడు మళ్లీ ఫామ్‌లోకి వస్తాడు. మనం కాస్త ఓపిక పట్టాలి" అని లాంగర్ చెప్పాడు.

ఇక నాయకుడిగా కూడా ఫించ్‌ ఆకట్టుకుంటున్నాడు. జట్టులో ఎటువంటి తారతమ్యాలు లేకుండా ముందుకు తీసుకెళుతున్నాడు. అతనిది చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం" అని లాంగర్ చెప్పాడు. ఇక రెండో టీ20లో సెంచరీ సాధించి ఆస్ట్రేలియా సిరీస్‌ సాధించడంలో కీలక పాత్ర పోషించిన మ్యాక్స్‌వెల్‌పై కూడా లాంగర్‌ ప్రశంసలు కురిపించాడు.

తమకు మ్యాక్సీ చాలా కీలక ఆటగాడని, ఇటీవల కాలంలో అతని ఆట తీరులో మరింత నిలకడ పెరగడం ఆసీస్‌ జట్టుకు శుభపరిణామమని చెప్పాడు. ఇక, ఫించ్ కెప్టెన్సీపై లాంగర్‌ ప్రశంసలు కురిపించాడు. కెప్టెన్సీ చేపట్టిన తర్వాత అతడి వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పు రాలేదని లాంగర్ అన్నాడు. ఆటగాళ్లతో ఎప్పటిలాగే ప్రవర్తిస్తున్నాడని పేర్కొన్నాడు.

Story first published: Friday, March 1, 2019, 16:33 [IST]
Other articles published on Mar 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X