న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షోయబ్‌ అక్తర్‌కు సమన్లు!!

FIA summons Shoaib Akhtar over PCB advisor’s complaint

కరాచీ: పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) లీగల్‌ అడ్వైజర్‌ తఫాజ్జుల్‌ రిజ్వి అసమర్థుడని సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ దేశ మాజీ పేసర్‌, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్‌ అక్తర్‌కు ఫెడరల్‌ ఇన్విస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) సమన్లు జారీ చేసింది. రిజ్విపై అక్తర్‌ చేసిన వ్యాఖ్యలపై విచారణకు సిద్ధమైన ఎఫ్‌ఐఏ.. ముందుగా సమన్లు పంపింది. శుక్రవారం షోయబ్‌ అక్తర్‌ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన తర్వాత విచారణను చేపట్టనున్నట్లు ఎఫ్‌ఐఏ పేర్కొంది.

నాకే సొంతమైన చిన్నారితో..‌ ఇంట్లోనే మేకప్‌!!నాకే సొంతమైన చిన్నారితో..‌ ఇంట్లోనే మేకప్‌!!

'ఇప్పటివరకు అక్తర్‌పై ఎటువంటి కేసు నమోదు చేయలేదు. అతని యూట్యూబ్‌ చానల్‌లో పీసీబీ లీగల్‌ అడ్వైజర్‌ తఫాజ్జుల్ రిజ్విని దూషించిన క్రమంలో ఫిర్యాదు అందింది. దాంతో ముందుగా అక్తర్‌కు సమన్లు జారీ చేశాం. అక్తర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలా వద్దా అనేది స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్నాక పరిశీలిస్తాం' అని ఎఫ్‌ఐఏ అధికారి ఒకరు తెలిపారు.

అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా న్యాయపరమైన అంశాల్లో మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌ కలగజేసుకున్నందుకు అతనిపై భారీ పరువు నష్టం దావా (100 మిలియన్లు పాకిస్తాన్‌ కరెన్సీ) వేశాడు తఫాజ్జుల్‌ రిజ్వి. అవినీతి ఆరోపణల్లో భాగంగా పాకిస్తాన్‌ వెటరన్‌ క్రికెటర్‌ ఉమర్‌ అక్మల్‌పై మూడేళ్లు నిషేధం విధించిన సందర్భంలో పీసీబీ లీగల్‌ డిపార్ట్‌మెంట్‌పై అక్తర్‌ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు రావల్పిండి ఎక్స్‌ప్రెస్ తన యూట్యూబ్‌ చానల్‌లో ఓ వీడియోను విడుదల చేశాడు. మూడేళ్ల నిషేధాన్ని తప్పుబట్టాడు. ఇది పీసీబీ లీగల్‌ అడ్వైజరీ అసమర్థవత వల్లే ఉమర్‌కు మూడేళ్ల శిక్ష పడిందంటూ వ్యాఖ్యానించాడు.దాంతో అక్తర్‌పై పరువు నష్టం కేసును రిజ్వి దాఖలు చేశాడు.

రిజ్వి పరువు నష్టం దావా నోటీసులు అర్థరహితమని ఇటీవల అక్తర్ కొట్టిపారేసిన విషయం తెలిసిందే. 'పాకిస్థాన్ క్రికెట్ బోర్డు‌ పనితీరు మెరుగయ్యేందుకే నేను కాస్త ఘాటుగా సూచనలు చేశా. అది కూడా పీసీబీలో ఏం జరుగుతుందో.. ప్రజలకు తెలియాలనే తప్ప మరో ఉద్దేశంతో కాదు. రిజ్వి గురించి నేను చేసిన వ్యాఖ్యలు అతనితో నాకు వ్యక్తిగతంగా ఉన్న చనువుతో చేసినవే. కానీ రిజ్వీనే నాకు నోటీసులు జారీ చేసి నన్ను అవమానించాడు. కాబట్టి అతనే నాకు క్షమాపణలు చెప్పాలి' అని అక్తర్ డిమాండ్ చేశాడు.

అక్తర్‌ పాక్‌ తరపున 46 టెస్టుల్లో 176 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు, 15 టీ20 ల్లో 19 వికెట్స్ పడగొట్టాడు. పాకిస్థాన్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 224 మ్యాచ్‌లు ఆడిన అక్తర్.. 444 వికెట్లతో ప్రపంచంలో అత్యంత భయంకరమైన బౌలర్లలో ఒకరిగా నిలిచాడు. 2003 వన్డే ప్రపంచకప్‌లో గంటకి 161.3కిమీ వేగంతో బంతిని విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

Story first published: Thursday, June 4, 2020, 18:39 [IST]
Other articles published on Jun 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X