న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టులకు ఐదు శాశ్వత వేదికలు చాలన్న కోహ్లీ వ్యాఖ్యలపై కుంబ్లే ఏమన్నాడో తెలుసా?

Anil Kumble Backs Kohli's Formula For Test Cricket || Oneindia Telugu
Fewer Centres, Better Marketing: Kumble Backs Kohli’s Formula for Test Cricket

హైదరాబాద్: భారత్‌లో జరగబోయే టెస్టు మ్యాచ్‌లకు శాశ్వత వేదికలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోహ్లీ చేసిన వ్యాఖ్యలతో టీమిండియా మాజీ హెడ్ కోచ్ అనిల్‌ కుంబ్లే ఏకీభవించాడు. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో రొటేషన్ పద్ధతిలో టెస్ట్ మ్యాచ్‌లు నిర్వహించడంపై కోహ్లీ వ్యతిరేకించాడు.

కోహ్లీ మాట్లాడుతూ టెస్టు క్రికెట్‌ను బ్రతకాలంటే ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా తరహాలో ఐదు టెస్టు వేదికలు ఉంటే బెటర్ అని అన్నాడు. అభిమానులు వస్తారో లేదో తెలియని స్టేడియాల్లో టెస్టు మ్యాచ్‌లను నిర్వహించడం వల్ల లాభం లేదని కోహ్లీ పేర్కొన్నాడు. తాజాగా కుంబ్లే మాట్లాడుతూ అభిమానులకు మెరుగైన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తే టెస్టు క్రికెట్‌ను బతికించుకోవచ్చని అన్నాడు.

రొటేషన్ పాలసీ వద్దు... ఐదు శాశ్వత వేదికలే ముద్దు: కోహ్లీ కొత్త పలుకురొటేషన్ పాలసీ వద్దు... ఐదు శాశ్వత వేదికలే ముద్దు: కోహ్లీ కొత్త పలుకు

టెస్టులను బ్రతికించుకోవాడనికి మెరుగైన మార్కెటింగ్‌ పద్ధతులను అవలంభించాలని ఈ సందర్భంగా అనిల్ కుంబ్లే సూచించాడు. కుంబ్లే మాట్లాడుతూ "టెస్టు క్రికెట్‌ను ప్రమోట్ చేసేందుకు ఇదోక మార్గం. వేదికలను తగ్గించడమే కాకుండా మ్యాచ్‌ల నిర్వహణ సమయమూ కీలకమే. పొంగల్‌ సమయంలో చెన్నైలో టెస్టు మ్యాచ్‌లు నిర్వహించడం మనందరికీ గుర్తే" అని అన్నాడు.

టెస్టు సెంటర్స్‌ను ప్రోత్సహించడం

టెస్టు సెంటర్స్‌ను ప్రోత్సహించడం

"అభిమానులకు మెరుగైన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు కల్పించొచ్చు. సీజన్‌ మొదలైనప్పుడు ఢిల్లీ తర్వాత బెంగళూరు, ముంబై, కోల్‌కతాలో టెస్టులు నిర్వహిస్తే బాగుంటుంది. టెస్టు సెంటర్స్‌ను ప్రోత్సహించడం టెస్ట్ క్రికెట్‌కు చాలా ముఖ్యం అని నేను భావిస్తున్నాను. ఈ సీజన్ ప్రారంభానికి ముందు మీరు టెస్ట్ మ్యాచ్‌లు ఎక్కడెక్కడ మ్యాచులు జరుగుతాయో ముందే తెలుస్తుంది" అని కుంబ్లే అన్నాడు.

టెస్ట్ క్రికెట్‌ను బాగా మార్కెట్‌ చేసుకోవచ్చు

టెస్ట్ క్రికెట్‌ను బాగా మార్కెట్‌ చేసుకోవచ్చు

"ద్వారా టెస్ట్ క్రికెట్‌ను బాగా మార్కెట్‌ చేసుకోవచ్చు. అభిమానులు స్టేడియాలకు వచ్చేలా చేయొచ్చు. నేను కోచ్‌గా ఉన్నప్పుడు ఆరు వేర్వేరు వేదికల్లో మ్యాచులు జరిగాయి. అన్నీ కొత్తవే. అందులో ఇండోర్‌ మాత్రమే అభిమానులతో నిండింది. అక్కడి వాతావరణం చాలా బాగుంది. నగరం నడిబొడ్డున మైదానం ఉంది. అందుకే సమయంతో సంబంధం లేకుండా ఆటను చూడ్డానికి వచ్చారు" అని కుంబ్లే తెలిపాడు.

మెరుగైన సౌకర్యాలు కల్పించాలి

మెరుగైన సౌకర్యాలు కల్పించాలి

"టెస్టు మ్యాచ్‌లు చూసేందుకు వచ్చే అభిమానులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. సౌకర్యవంతమైన సీట్లు, స్టేడియానికి ప్రవేశం, టికెటింగ్, టిక్కెట్లను జారీ చేసేటప్పుడు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలి. దీంతో పాటు ఆహారం, నీరు, మరుగుదొడ్ల వసతులు మెరుగ్గా ఉండాలి. ఇవన్నీ మనం అందిస్తే ప్రేక్షకులు మైదానాలకు రావొచ్చు" అని కుంబ్లే పేర్కొన్నాడు.

డే-నైట్‌ టెస్టులు జనాలను ఆకర్షిస్తాయి

డే-నైట్‌ టెస్టులు జనాలను ఆకర్షిస్తాయి

"డే-నైట్‌ టెస్టులు జనాలను ఆకర్షిస్తాయి. ఆట యొక్క చివరి భాగంలో జనాలు బాగా వస్తారని నేను అనుకుంటున్నాను. ఏడాదిలో డే-నైట్‌ టెస్టుకు ఏది అనువైన సమయమో గుర్తించాలి. ఎందుకంటే ఇప్పుడు డే-నైట్‌ వన్డేలు, టీ20ల్లో బంతి తడిసిపోతుంది. కాబట్టి, వేదికతో పాటు సంవత్సరాన్ని ఎంచుకోవలసి ఉంటుంది. రాత్రిపూట మ్యాచ్‌ జరిగితే పగలు పనులన్నీ ముగించుకొని కొన్నిగంటలైనా మ్యాచ్‌ చూసేందుకు అభిమానులు వస్తారు. అతి త్వరలోనే డే-నైట్‌ టెస్టు జరుగుతుందని ఆశిస్తున్నా" అని కుంబ్లే తెలిపాడు.

Story first published: Saturday, October 26, 2019, 10:01 [IST]
Other articles published on Oct 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X