న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'టీ20 ప్రపంచకప్‌కు సమయం లేదు.. డివిలియర్స్‌ త్వరగా రా'

Faf Du Plessis says Talks On For 2-3 Months To Get AB De Villiers Back In Team

కేప్‌టౌన్‌: గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్‌ 'మిస్టర్ 360' ఏబీ డివిలియర్స్‌ రీఎంట్రీ కోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ ఫాఫ్ డుప్లెసిస్‌ కూడా ఉన్నాడు. డివిలియర్స్‌ రీఎంట్రీ కోసం గత రెండు మూడు నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు ఎక్కువ సమయం లేదు. ఏబీ త్వరగా జట్టుతో కలిస్తే బాగుంటుంది అని డుప్లెసిస్‌ అంటున్నాడు.

క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన మూడు ప్రపంచకప్‌ల విన్నర్‌!క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన మూడు ప్రపంచకప్‌ల విన్నర్‌!

డివిలియర్స్‌ త్వరగా రా:

డివిలియర్స్‌ త్వరగా రా:

తాజాగా డుప్లెసిస్‌ మాట్లాడుతూ... 'ప్రస్తుతం మా జట్టుకు టెస్టు క్రికెట్‌ చాలా ముఖ్యం. కానీ.. టీ20 క్రికెట్‌ చాలా భిన్నమైనది. డివిలియర్స్‌ రాకతో మా జట్టు బలోపేతం అవుతుంది. డుప్లెసిస్‌ వస్తానంటే ఎవరూ అడ్డు చెప్పరు. అందరం సాదరంగా స్వాగతిస్తాం. టీ20 ప్రపంచకప్‌కు ఎంతో సమయం లేదు. మా రోడ్‌ మ్యాప్‌ చాలా బిజిగా ఉంది. ఆ టోర్నిలోగా అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు చాలా ఆడాల్సి ఉంది. ఏబీ తొందరగా జట్టులో కలిస్తే తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు' అని అన్నాడు. దీంతో ఏబీ రీఎంట్రీ దాదాపు షురూ అయ్యింది.

సంధి దశలో దక్షిణాఫ్రికా:

సంధి దశలో దక్షిణాఫ్రికా:

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెట్‌ సంధి దశలో ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి డివిలియర్స్‌, హషీమ్‌ ఆమ్లా, డుమిని, తాహిర్ ఒక్కసారిగా రిటైర్మెంట్‌ తీసుకోవడంతో ఆ జట్టు గాడి తప్పింది. తాజాగా సఫారీ ప్రధాన కోచ్‌గా ఎంపికైన మార్క్‌ బౌచర్‌.. జట్టును చక్కదిద్దే పనిలో పడ్డాడు. మరోవైపు కెప్టెన్‌ డుప్లెసిస్‌ కూడా అతనికి సహకారం అందిస్తున్నాడు. ఈ ఇద్దరు డివిలియర్స్‌ రీఎంట్రీ కోసం చర్చలను వేగవంతం చేశారు.

2023 వరకు కోచ్‌గా బౌచర్‌:

2023 వరకు కోచ్‌గా బౌచర్‌:

మార్క్ బౌచర్ శనివారం దక్షిణాఫ్రికా కోచ్‌గా నియమితుడయ్యాడు. 2023 వరకూ బౌచర్‌ కోచ్‌గా కొనసాగనున్నాడు. వచ్చే ఏడాది జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు అత్యుత్తమ ఆటగాళ్లతో జట్టును ఉంచడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని చెప్పిన బౌచర్‌.. ఇందులో భాగంగా రిటైర్మెంట్‌ తీసుకున్న ఏబీతో మాట్లాడతానని తెలిపాడు.

2004లో అరంగేట్రం:

2004లో అరంగేట్రం:

2004లో దక్షిణాఫ్రికా జట్టు తరుపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఏబీ టెస్టుల్లో 8,765.. వన్డేల్లో 9,577.. టీ20ల్లో 1,672 పరుగులు చేశాడు. మోడ్రన్ డే క్రికెట్‌లో దక్షిణాఫ్రికా బోర్డు అందించిన అత్యుత్తమ ఆటగాళ్లలో డివిలియర్స్ ఒకడు. రిటైర్మెంట్ తర్వాత డివిలియర్స్ పలు లీగ్‌ల్లో ఆడుతున్న విషయం తెలిసిందే.

Story first published: Tuesday, December 17, 2019, 15:08 [IST]
Other articles published on Dec 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X