ఐసీసీ సమన్యాయం పాటించట్లేదు: డుప్లెసిస్

Posted By:
Faf du Plessis questions ICC's demerit system as Kagiso Rabada cops series ban

హైదరాబాద్: ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ మండలి)పై దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. క్రికెటర్ల క్రమశిక్షణా రహిత ప‍్రవర్తనకు విధించే డీమెరిట్‌ పాయింట్లపై ప్రొటీస్‌ కెప్టెన్‌ డుప్లెసిస్‌ స్పందించాడు. ఐసీసీ అందరిని సమానంగా చూడట్లేదంటూ వాపోయాడు.

అం‍దరినీ సమాన దృష్టితో చూడాల్సిన ఐసీసీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డాడు. ఇందుకు ఆసీస్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌, తమ దేశ పేసర్‌ రబాడలపై చర్యలే ఉదాహరణగా డుప్లెసిస్‌ విమర్శించాడు. వీరి విషయంలో సమ న్యాయం జరగలేదని ధ్వజమెత్తాడు.

వార్నర్‌ తొలి టెస్ట్‌లో డికాక్‌ను ఉద్దేశపూర్వకంగా దూషించినపుడు లెవల్‌ 2 కింద మూడు డీమెరిట్‌ పాయింట్లు ఇచ్చారు. రెండో టెస్ట్‌లో రబాడ అనుకోకుండా స్మిత్‌ భుజాన్ని తాకటంతో లెవల్‌2 కింద నాలుగు డీమెరిట్‌ పాయింట్లు, 65 శాతం మ్యాచ్‌ ఫీజులో కోత విధించారు. రబాడకి కూడా మూడు డీమెరిట్‌ పాయింట్లు ఇచ్చుంటే ఆస్ట్రేలియాతో జరిగే మిగతా టెస్టులు ఆడేవాడని కానీ ఐసీసీ తమకు వ్యతిరేకంగా ప్రవర్తించిందని ఐసీసీని డుప్లెసిస్‌ విమర్శించాడు.

ప్రస్తుతం రబడా అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు, రెండో టెస్ట్‌లో 11 వికెట్లతో విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక రబడా విషయంపై ఐసీసీ వ్యతిరేకంగా అప్పీల్‌కు వెళ్లినా లాభం ఉండదనే ఉద్దేశంతో వెళ్లటంలేదని డుప్లెసిస్‌ పేర్కొన్నాడు.

Story first published: Tuesday, March 13, 2018, 16:34 [IST]
Other articles published on Mar 13, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి