న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

EXPLAINED: హాల్ ఆఫ్ ఫేమ్‌: సచిన్‌కు ఎందుకు ఆలస్యంగా ఇచ్చారో తెలుసా!

Sachin Tendulkar Inducted In ICC Hall Of Fame After Rahul Dravid And Anil Kumble - Here’s Why ?
EXPLAINED: Why Anil Kumble, Rahul Dravid made it to ICC Hall of Fame before Sachin Tendulkar

హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ని ఐసీసీ శుక్రవారం ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు కల్పించి సముచిత గౌరవాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ నుంచి ఈ ఘనత సాధించిన ఆరో క్రికెటర్‌గా సచిన్‌ టెండూల్కర్ అరుదైన ఘనత సాధించాడు. సచిన్‌తో పాటు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ అలన్‌ డొనాల్డ్‌, ఆస్ట్రేలియా మాజీ మహిళా క్రికెటర్‌ క్యాథరిన్‌ ఫిట్జ్‌పాట్రిక్‌‌లకు కూడా ఈ అరుదైన గౌరవం లభించింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో

ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో

దీంతో ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో స్థానం దక్కించుకున్న క్రికెటర్ల సంఖ్య 87కి చేరింది. ఈ జాబితాలో అత్యధికంగా ఇంగ్లాండ్‌ నుంచి 28 మంది క్రికెటర్లు, ఆస్ట్రేలియా నుంచి 25 మంది ఉండగా.. అత్యల్పంగా శ్రీలంక నుంచి ఒక్కరికే చోటు లభించింది. అయితే, సచిన్ కంటే ముందు భారత్ నుంచి బిషన్‌సింగ్ బేడి(2009), సునీల్‌ గవాస్కర్‌(2009), కపిల్‌దేవ్‌(2009), అనిల్ కుంబ్లే (2015), రాహుల్‌ ద్రవిడ్‌ (2018) ఈ ఘనత సాధించారు.

రికార్డుల పరంగా అగ్రస్థానంలో

రికార్డుల పరంగా అగ్రస్థానంలో

నిజానికి ప్రపంచ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ రికార్డుల పరంగా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ ప్రతిష్టాత్మక హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు ఎందుకు ఆలస్యమైంది? అని సగటు క్రికెట్‌ అభిమాని మదిలో మొదలే ప్రశ్న. అనిల్‌ కుంబ్లే, రాహుల్‌ ద్రవిడ్‌లతో పోలిస్తే సచిన్‌ టెండూల్కర్ ఆలస్యంగా రావడానికి కారణం ఐసీసీ నిబంధనలే కారణం.

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు కల్పించాలంటే నిబంధనలివే:

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు కల్పించాలంటే నిబంధనలివే:

బ్యాట్స్‌మెన్‌ అయితే వన్డేలు లేదా టెస్టుల్లో కనీసం 8వేల పరుగులు పూర్తి చేసి ఉండాలి. అలాగే 20 సెంచరీలు సాధించాలి. యావరేజి 50కి పైనే ఉండాలి.

బౌలర్ల విషయానికొస్తే 50 టెస్టులు, 30 వన్డేలు ఆడి కనీసం ఏదో ఒక ఫార్మాట్‌లో 200 వికెట్లు తీసుండాలి.

అన్నింటికంటే ముఖ్యమైంది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఐదేళ్లు పూర్తి అయి ఉండాలి.

2008లో కుంబ్లేకి

2008లో కుంబ్లేకి

కాగా, అనిల్‌ కుంబ్లే 2008లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో అతనికి 2015లో హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో స్థానం దక్కింది. రాహుల్‌ ద్రవిడ్‌ 2012లో రిటైర్మెంట్‌ ప్రకటించడంతో 2018లో ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. కాగా, సచిన్ టెండూల్కర్ 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఐదేళ్లు పూర్తి కావడంతో సచిన్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

Story first published: Friday, July 19, 2019, 19:38 [IST]
Other articles published on Jul 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X