న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భవిష్యత్తులో ధోని స్పెషలిస్ట్ వికెట్ కీపింగ్ కోచ్ అవుతాడు

By Nageshwara Rao
Exclusive: MS Dhoni can become specialist wicketkeeping coach in future, says former India stumper

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ జట్లు తమ సపోర్టింగ్ స్టాప్‌లో స్పెషలిస్ట్ వికెట్ కీపర్లను కోచ్‌లుగా నియమించుకోవాలని టీమిండియా మాజీ వికెట్ కీపర్ కిరన్ మోరే అభిప్రాయపడ్డాడు. వికెట్ కీపర్లుగా మారాలనుకుంటున్న యువ క్రికెటర్లకు ప్రస్తుతం సరైన టెక్నికల్ గైడెన్స్ అందడం లేదని పేర్కొన్నాడు.

IND VS SA 1st T20 : Dhoni Picks Most Catches in T20s

తాజాగా ఓ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో కిరన్ మోరే మాట్లాడుతూ 'జట్టులో వికెట్ కీపింగ్ అనేది కీ ఏరియా. సరైన వికెట్ కీపర్ లేకపోతే అది జట్టు మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. వికెట్ కీపింగ్ కోచింగ్‌ను విస్మరిస్తున్నారు. జట్టులో వికెట్ కీపింగ్‌కు సంబంధించిన కోచ్ ఉండటం ఎంతో ముఖ్యం. జట్టుతో పాటు బౌలింగ్ కోచ్‌లు, బ్యాటింగ్ కోచ్‌లు, ఫీల్డింగ్ కోచ్‌లు ఉంటున్నారు. అయితే వికెట్ కీపింగ్ కోచ్ కూడా ముఖ్యం' అని అన్నాడు.

'వికెట్ కీపర్‌కు అన్ని ఫార్మాట్లలో అవకాశాలు లభిస్తాయి. ఎవరైతే వికెట్ కీపింగ్ స్కిల్స్‌పై దృష్టిపెడతారో వారికే అది సాధ్యమవుతుంది. అలా చేయబట్టే, నేను వికెట్ కీపింగ్‌లో టాప్ లెవెల్‌కు చేరుకున్నాను. కీపింగ్‌లో గట్టి పునాదులను నిర్మించుకోవాలి' అని మోరీ చెప్పుకొచ్చాడు.

'మైదానంలో సరైన టెక్నిక్‌ను ప్రదర్శించకుండా వికెట్ కీపర్ గాయపడితే, అది జట్టులో అతడి దీర్ఘకాలిక చోటుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. సరైన టెక్నిక్‌ను ప్రదర్శించకపోతే వికెట్ కీపర్లు గాయపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి, యుక్త వయసులోనే ఫౌండేషన్ నెలకొల్పడం ఎంతో ముఖ్యం' అని తెలిపాడు.

'ధోని వికెట్ కీపింగ్ కోచింగ్ అయితే బాగుంటుంది. ధోని వికెట్ కీపింగ్ ఫౌండేషన్ ప్రారంభిస్తే అదేమీ తప్పు కాదు' అని అన్నాడు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ వికెట్ కీపర్లలో ధోని ఒకడిగా ఉన్న సంగతి తెలిసిందే. వికెట్ కీపింగ్‌లో ధోని స్టయిలే వేరు.

ప్రపంచంలో అత్యధిక డిస్మిసల్స్ చేసిన వికెట్ కీపర్ల జాబితాలో ధోని (775) మూడో స్ధానంలో ఉన్నాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికాకు చెందిన మార్క్ బౌచర్ (998)తో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ గిల్ క్రిస్ట్ (905)తో రెండో స్థానంలో ఉన్నాడు.

2014లో టెస్టు క్రికెట్‌కు ధోని వీడ్కోలు పలికిన తర్వాత అతడి స్థానంలో వృద్ధిమాన్ సాహా వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు. అయితే టెస్టు క్రికెట్‌లో పార్దీవ్ పటేల్, నోమన్ ఓజాలు వికెట్ కీపర్లు తుది జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ రాణించలేకపోతున్నారు.

Story first published: Tuesday, February 20, 2018, 14:30 [IST]
Other articles published on Feb 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X