న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భవిష్యత్తులో ప్రతి ఏడాది రెండు ఐపీఎల్ సీజన్లు.. ఎలా జరుగుతాయో కూడా చెప్పిన రవిశాస్త్రి..!

Every Year Two IPL Seasons Will be Conducting in near Future Says Ravi shastri

టీ20 లీగ్‌లకు పెరుగుతున్న ఆదరణ వల్ల సంవత్సరానికి రెండు ఐపీఎల్ సీజన్‌లు జరగడం ఖాయమని భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తన అభిప్రాయాన్ని మరోసారి బల్లగుద్ది చెప్పాడు. టెలిగ్రాఫ్ స్పోర్ట్స్ పోడ్‌కాస్ట్‌తో మాట్లాడుతూ.. ఒక నార్మల్ ఐపీఎల్‌తో పాటు నాకౌట్ తరహాలో మరో ఐపీఎల్ టోర్నమెంట్ జరుగుతుందని చెప్పాడు. 'భవిష్యత్తులో రెండు ఐపీఎల్ సీజన్లు ఉండవచ్చని నేను కచ్చితంగా భావిస్తున్నాను. నేను అది జరిగితే అస్సలు ఆశ్చర్యపోను కూడా. అంతర్జాతీయ క్రికెట్లో ద్వైపాక్షిక క్రికెట్‌ టోర్నీలను తగ్గించినట్లయితే.. మీరు ఏటా రెండు ఐపీఎల్ సీజన్లను చూడొచ్చు.

రెండు ఐపీఎల్ సీజన్లలో ఒకటి నార్మల్.. రెండోది మినీ

రెండు ఐపీఎల్ సీజన్లలో ఒకటి నార్మల్.. రెండోది మినీ

ఒక ఐపీఎల్ సీజన్ ఎప్పటిలాగే వేసవిలో జరుగుతుంది. మరో మినీ ఐపీఎల్ ఏడాది చివర్లో జరుగుతుంది. ఈ మినీ ఐపీఎల్ కంప్లీట్‌గా నాకౌట్‌ పద్ధతిలో జరుగుతుంది. అంటే ప్రపంచ కప్ ఫార్మాట్ లాగా ఉంటుంది. అలాగే కాలక్రమేణా జట్ల సంఖ్య కూడా 10 నుంచి 12కు పెరుగుతాయి. ఎందుకంటే ఐపీఎల్‌కు అంతటి డిమాండ్ ఉంది. అందువల్ల నేను చెప్పేవన్ని సాధ్యమయ్యేవే. అదే జరిగితే క్రికెట్ కూడా మరింత అభివృద్ధి చెందుతుంది.' అని రవిశాస్త్రి చెప్పాడు.

ఐపీఎల్‌కు ఉన్న డిమాండ్ అలాంటిది..

ఐపీఎల్‌కు ఉన్న డిమాండ్ అలాంటిది..

ఇకపోతే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఇటీవల తదుపరి సైకిల్ FTP 2023 - 27వరకు ఐపీఎల్ విండోను రెండు నెలల నుండి రెండున్నర నెలలకు పెంచిన సంగతి తెలిసిందే. 'ఐపీఎల్ డబ్బులకు సంబంధించిన యవ్వారం. ఐపీఎల్‌ ఓ డిమాండ్ ఆటలాగా నడుస్తుంది. కాబట్టి ఈ సక్సెస్ సాధ్యమైంది. ఐపీఎల్ తరహా టీ20 ఫార్మాట్‌కు డిమాండ్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అందువల్ల 10జట్లు కాస్త 12జట్లు కావొచ్చు. ఇది ఆటకు కూడా మంచిదే. తద్వారా ప్లేయర్లకు, ప్రసారకర్తలకు, ఫ్రాంచైజీలకు, ఐపీఎల్‌లో పనిచేసే వేలాది మంది వ్యక్తులకు ఉపయుక్తమవుతుంది. ఐపీఎల్ అనేది ఓ స్వతహాగా దానికదే నిలదొక్కుకునే పరిశ్రమ' అని రవిశాస్త్రి తెలిపారు.

ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లు అవసరమా?

ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లు అవసరమా?

ఇకపోతే టీ20 క్రికెట్‌లో ద్వైపాక్షిక సిరీస్ల విషయంలో నేను కొంచెం జాగ్రత్తగా ఉంటాను. టీ20 క్రికెట్‌ను ఇండియా, వెస్టిండీస్, పాకిస్థాన్‌ దాదాపు అన్నిదేశాలలో ఫ్రాంచైజీ క్రికెట్ తరహాలో ప్రాచుర్యంలో ఉంది. నా ప్రకారం ద్వైపాక్షిక అంతర్జాతీయ టీ20 సిరీస్‌లు తగ్గించాలి. ప్రపంచ కప్‌ లాంటి కీలక ఈవెంట్లలో మాత్రమే టీ20 క్రికెట్ జరపాలి. ICC నిర్వహించే ప్రపంచకప్ లాంటి ఈవెంట్లకు మంచి ప్రాధాన్యత ఉంటుంది.. ప్రజలు కూడా బాగా ఆదరణగా చూస్తుంటారు' అని శాస్త్రి చెప్పాడు. ఇక ప్రస్తుతం యూఏఈ టీ20 లీగ్, దక్షిణాఫ్రికా టీ20లీగ్‌కు సంబంధించిన న్యూస్ హాట్ హాట్‌గా ట్రెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయా లీగ్‌లలో ప్లేయర్లపై కాసులు కురిపించడానికి ఫ్రాంచైజీలు కూడా సిద్ధమయ్యాయి.

Story first published: Thursday, July 28, 2022, 22:41 [IST]
Other articles published on Jul 28, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X