న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పరుగుల వరద: టీ20ల్లో ఇంగ్లాండ్ అత్యధిక స్కోరు, బద్దలైన రికార్డులివే!

Eoin Morgan, Dawid Malan break multiple records with highest partnership for England in T20Is


హైదరాబాద్:
తొలిసారి ప్రపంచ విజేతగా నిలిచిన నెలల తర్వాత కూడా ఇంగ్లాండ్ జట్టు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఆకట్టుకుంటూనే ఉంది. నేపియర్ వేదికగా శుక్రవారం న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ పరుగుల వరద పారించారు.

డేవిడ్ మలన్(103 నాటౌట్, 51 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సులు), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(91, 41 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సులు)తో రాణించడంతో ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. ఇక్కడ విశేషం ఏంటంటే వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 182 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

6 బంతుల్లో 6 సిక్సర్లు కొడదామనుకున్నా!: చాహల్ టీవీ ఇంటర్యూలో రోహిత్ శర్మ6 బంతుల్లో 6 సిక్సర్లు కొడదామనుకున్నా!: చాహల్ టీవీ ఇంటర్యూలో రోహిత్ శర్మ

అత్యధిక పరుగుల భాగస్వామ్య రికార్డు

అత్యధిక పరుగుల భాగస్వామ్య రికార్డు

ఈ క్రమంలో టీ20ల్లో ఇంగ్లాండ్ అత్యధిక పరుగుల భాగస్వామ్య రికార్డుని మలన్-మోర్గాన్ జోడీ బద్దలు కొట్టింది. 2012లో నాటింగ్ హామ్ వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు రవి బొపారా-అలెక్స్ హేల్స్‌లు నెలకొల్పిన 159 పరుగుల భాగస్వామ్యాన్ని ఈ జోడి అధిగమించింది.

టీ20 కెరీర్‌లో తొలి సెంచరీ

కివీస్ బౌలర్లను చీల్చి చెండాడిన డేవిడ్ మలన్ తన టీ20 కెరీర్‌లో తొలి సెంచరీని సాధించాడు. మలన్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 6 సిక్సులు ఉండటం విశేషం. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు స్కోరు 16 పరుగుల వద్ద జానీ బెయిర్ స్టో(8) తొలి వికెట్‌గా కోల్పోయింది.

చెలరేగిన ఇయాన్ మోర్గాన్

అనంతరం క్రీజులోకి వచ్చిన డేవిడ్ మలన్‌తో కలిసి ఓపెనర్ టామ్ బాంటన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అయితే, జట్టు స్కోరు 58 పరుగుల వద్ద బాంటన్(31) మిచెల్ శాంట్నర్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌తో కలిసి మలన్ కివీస్ బౌలర్లను చెడుగుడు ఆడాడు.

మోర్గాన్ స్ట్రయిక్ రేట్ 221.95గా నమోదు

మోర్గాన్ స్ట్రయిక్ రేట్ 221.95గా నమోదు

మరోవైపు మోర్గాన్ సైతం బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో సెంచరీ ముంగిట టిమ్ సౌథీ బౌలింగ్‌లో మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో తృటిలో ఇయాన్ మోర్గాన్ సెంచరీని కోల్పోయాడు. ఇయాన్ మోర్గాన్ స్ట్రయిక్ రేట్ 221.95గా నమోదవడం విశేషం.

ఇంగ్లాండ్ నెలకొల్పిన రికార్డులివే

ఇంగ్లాండ్ నెలకొల్పిన రికార్డులివే

* మోర్గాన్ ఇంగ్లండ్ తరుపున అత్యంత వేగవంతమైన టీ20 సెంచరీని సాధించాడు. ఈ మ్యాచ్‌లో 21 బంతుల్లోనే మోర్గాన్ హాఫ్ సెంచరీని సాధించాడు. ఈ క్రమంలో బర్మింగ్‌హామ్ వేదికగా 2018లో ఆస్ట్రేలియాపై జోస్ బట్లర్(22 బంతుల్లో) సాధించిన రికార్డుని బద్దలు కొట్టాడు.

* టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ఇంగ్లీష్ బ్యాట్స్ మన్‌గా మలన్ అరుదైన ఘనత సాధించాడు.

* టీ20ల్లో ఇంగ్లాండ్ అత్యధిక స్కోరుని (241/3) నమోదు చేసింది. 2016లో దక్షిణాఫ్రికాపై సాధించిన మొత్తం 230/8ను ఈ మ్యాచ్‌లో అధిగమించింది.

* మోర్గాన్-మలన్ టీ20లో ఇంగ్లాండ్ తరఫున అత్యధిక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

* ఈ మ్యాచ్‌లో వీరి జోడి సాధించిన 182 పరుగుల భాగస్వామ్యం మూడో వికెట్‌కు అత్యధిక టీ20 భాగస్వామ్యం కావడం విశేషం.

Story first published: Friday, November 8, 2019, 13:29 [IST]
Other articles published on Nov 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X