2019-20 హోమ్ షెడ్యూల్ విడుదల.. హైదరాబాద్‌లో టీ20

మెగా టోర్నీ ప్రపంచకప్ అనంతరం భారత్‌లో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ సోమవారం విడుదల చేసింది. 2019-20 సీజన్‌లో భాగంగా భారత్ సొంతగడ్డపై వేర్వేరు జట్లతో 5 టెస్టులు, 9 వన్డేలు, 12 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సీజన్‌లో భారత్ మొత్తం 26 మ్యాచ్‌లు ఆడనుంది. షెడ్యూల్ ప్రకారం వెస్టిండీస్ జట్టుతో డిసెంబర్ 11న హైదరాబాద్‌లో టీమిండియా మూడో టీ20 మ్యాచ్ ఆడనుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

తొలి టెస్టుకు వైజాగ్ ఆతిథ్యం:
సెప్టెంబర్ 15న దక్షిణాఫ్రికాతో మొదలయ్యే 'ఫ్రీడమ్ కప్' ట్రోఫీతో సీజన్ ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికాతో మూడు టీ20లు, మూడు టెస్టులు జరుగుతాయి. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 23 వరకు పర్యటన కొనసాగనుంది. అక్టోబర్ 2 నుంచి 6 వరకు జరిగే తొలి టెస్టుకు వైజాగ్ ఆతిథ్యం ఇవ్వనుంది.

హైదరాబాద్‌లో టీ20:
నవంబర్‌లో భారత్‌లో పర్యటించనున్న బంగ్లాదేశ్.. 3 టీ20లు, రెండు టెస్టులు ఆడుతుంది. నవంబర్ 3 నుంచి 26 వరకు ఈ పర్యటన ఉంటుంది. ఇక డిసెంబర్ 6 నుంచి 22 వరకు వెస్టిండీస్ పర్యటిస్తుంది. ఇందులో భాగంగా జరుగనున్న 3 టీ20ల్లో చివరి మ్యాచ్‌కు హైదరాబాద్.. 3 వన్డేల్లో రెండో మ్యాచ్‌కు వైజాగ్ వేదికలుగా ఉన్నాయి. డిసెంబర్ 6న ముంబైలో తొలి టీ20, 8న తిరువనంతపురంలో రెండో టీ20 జరుగుతాయి. డిసెంబర్ 15న చెన్నైలో తొలి వన్డే, 22న కటక్‌లో మూడో వన్డే జరగనుంది.

మార్చి 18న చివరి మ్యాచ్:
అనంతరం జింబాబ్వేతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ (జనవరి 5-10) జరగనుంది. ఆపై ఆస్ట్రేలియా (జనవరి 14-19)తో సిరీస్ ఉంటుంది. చివరగా దక్షిణాఫ్రికా (మార్చి 12-18)తో ఆడనుంది. ఈ రెండు జట్లతో భారత్ 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. మార్చి 18న దక్షిణాఫ్రికాతో జరిగే చివరి మ్యాచ్‌తో భారత హోమ్ సీజన్ ముగుస్తుంది.
Freedom Trophy - 2019 against South Africa:
1st T20I: 15 September, Dharamsala
2nd T20I: 18 September , Mohali
3rd T20I: 22 September, Bengaluru
1st Test: 2-6 October, Vizag
2nd Test: 10-14 October, Ranchi
3rd Test: 19-23 October, Pune
Bangladesh's Tour of India - 2019:
1st T20I: 3 November, Delhi
2nd T20I: 7 November, Rajkot
3rd T20I: 10 November, Nagpur
1st Test: 14-18 November, Indore
2nd Test: 22-26 November, Kolkata
West Indies' Tour of India 2019:
1st T20I: 6 December, Mumbai
2nd T20I: 8 December, Thiruvananthapuram
3rd T20I: 11 December, Hyderabad
1st ODI: 15 December, Chennai
2nd ODI: 18 December, Vizag
3rd ODI: 22 December, Cuttack
Zimbabwe's Tour of India - 2020:
1st T20I: 5 January, Guwahati
2nd T20I: 7 January, Indore
3rd T20I: 10 January, Pune
Australia's Tour of India - 2020:
1st ODI: 14 January, Mumbai
2nd ODI: 17 January, Rajkot
3rd ODI: 19 January, Bengaluru.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications