ఒకేరోజు రెండు రికార్డులు బద్దలు: టీ20ల్లో అత్యధిక స్కోరు నమోదు

హైదరాబాద్: 24 గంటల్లోనే మహిళల టీ20 క్రికెట్‌లో రెండు ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ముక్కోణపు మహిళల టి20 క్రికెట్ టోర్నీలో ఈ రెండు రికార్డులు నమోదు కావడం విశేషం.

ఈ టోర్నీలో భాగంగా బుధవారం ఉదయం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 216 పరుగులు సాధించి ప్రపంచ రికార్డుని నెలకొల్పింది. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా (209/4; ఇంగ్లాండ్‌పై) పేరిట ఉంది.
న్యూజిలాండ్ కెప్టెన్ సుజీ బేట్స్ (66 బంతుల్లో 124 నాటౌట్; 16 ఫోర్లు, 3 సిక్స్‌లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ చార్లొటె ఎడ్వర్డ్స్‌ను పక్కకు నెట్టి బేట్స్.. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ ఉమన్ రికార్డును సొంతం చేసుకుంది.

తొలి వికెట్‌కు 182 పరుగులు
కాగా, కెప్టెన్‌కు మద్దతుగా సోఫియా డివైన్ ( 73; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో చెలరేగడంతో వీరిద్దరూ తొలి వికెట్‌కు 182 పరుగులు జోడించి రికార్డు సృష్టించారు. టీ20 క్రికెట్‌లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 150 పరుగులకే పరిమితమైంది. దీంతో దక్షిణాఫ్రికా మహిళల జట్టుపై న్యూజిలాండ్ 66 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.

టీ20లో అత్యధిక స్కోరు 260 పరుగులు
కాగా, పురుషుల క్రికెట్‌లో టీ20లో అత్యధిక స్కోరు 260 పరుగులుగా ఉంది. ఈ రికార్డు భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నమోదైంది. న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత సాయంత్రం ఇంగ్లాండ్‌తో దక్షిణాఫ్రికా రెండో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 250 పరుగులతో రికార్డు స్కోరు నమోదు చేశారు.

సెంచరీతో చెలరేగిన టామీ బ్యూమాంట్
ఓపెనర్ టామీ బ్యూమాంట్ (52 బంతుల్లో 116; 18 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో సెంచరీ సాధించింది. తొలి వికెట్‌కు వ్యాట్ (56)తో కలిసి బ్యూమాంట్ 147 పరుగులు జోడించింది. అనంతరం క్రీజులోకి వచ్చిన స్కివర్ 33 పరుగులు చేయగా, బ్రంట్ 42 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. దక్షిణాఫ్రికా బౌలర్ లాకె (2/5) రెండు వికెట్లు పడగొట్టింది.

121 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ మహిళల జట్టు 121 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ ఉమెన్ టామీ బ్యూమాంట్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications