న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్‌కు ఆరంభంలోనే షాక్: బెయిర్ స్టో గోల్డెన్ డకౌట్

ICC World Cup 2019: Tahir Gets Jonny Bairstow For golden Duck!! | Onbeindia Telugu
England vs South Africa Live Score, World Cup 2019: Imran Tahir removes Bairstow, England one down

హైదరాబాద్: ఓవల్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుకు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. తొలి ఓవర్ రెండో బంతికే ఆ జట్టు ఓపెనర్ జానీ బెయిర్‌స్టో పరుగులేమీ చేయకుండా పెవిలియన్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సఫారీ కెప్టెన్ డుప్లెసిస్ ఇంగ్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ నేపథ్యంలో ఓపెనర్లుగా జేస‌న్ రాయ్‌, జానీ బెయిర్‌స్టోలు ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెప్లిస్‌ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ తొలి ఓవ‌ర్‌ను సీనియర్ స్పిన్న‌ర్ ఇమ్రాన్ త‌హీర్‌తో వేయించాడు. మొదటి బంతికి జేసన్ రాయ్ ఒక పరుగు సాధించాడు. ఆ తర్వాత రెండో బంతికి బెయిర్‌స్టో ఔట్ చేశాడు.

తాహిర్ వేసిన బంతి బెయిర్ స్టో బ్యాట్‌ను తాకి నేరుగా వికెట్ కీప‌ర్ డీకాక్ చేతుల్లోకి వెళ్లింది. వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్న‌మెంట్‌లో ఓ ఓపెన‌ర్ డ‌కౌట్ కావ‌డం ఇదే మొద‌టిసారి. గోల్డెన్ డ‌కౌట్ అయిన తొలి ఇంగ్లాండ్ ప్లేయ‌ర్ కూడా బెయిర్‌స్టో కావ‌డం విశేషం. ప్ర‌స్తుతం ఇంగ్లండ్ 5 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్టానికి 29 పరుగులు చేసింది.

1
43644

అంతకముందు టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలి మ్యాచ్‌లో విజయం సాధించి టోర్నీని ఘనంగా ఆరంభించాలని ఇరు జట్లూ పట్టుదలతో ఉన్నాయి. సొంత గడ్డపై జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ రికార్డుకి దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా చేరువలో ఉన్నాడు.

{headtohead_cricket_2_6}

ఈ మ్యాచ్‌లో ఆమ్లా మరో 90 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 8వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. విరాట్ కోహ్లీ వన్డేల్లో 8వేల పరుగుల మైలరాయిని 175 ఇన్నింగ్స్‌లో అందుకోగా ఆమ్లా 171 ఇన్నింగ్స్‌లో 7910 పరుగులు సాధించాడు.

జట్ల వివరాలు:

దక్షిణాఫ్రికా: హషీమ్‌ ఆమ్లా, క్వింటన్‌ డికాక్‌, అయిడెన్‌ మార్క్రం, ఫా డు ప్లెసిస్‌(కెప్టెన్‌), రస్సీ వాన్‌ దర్‌ డుస్సెన్‌, జేపి డుమిని, అండిలే ఫెలుక్వాయో, డ్వైన్‌ ప్రిటోరియస్‌, రబాడా, లుండి ఎన్గిడి, ఇమ్రాన్‌ తాహిర్‌

ఇంగ్లాండ్: ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), జోరూట్‌, జేసన్ రాయ్, బెన్‌స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, మొయిన్‌ అలీ, క్రిస్‌వోక్స్‌, లియామ్‌ ప్లంకెట్‌, జోఫ్రా ఆర్చర్‌, అదిల్‌ రషీద్‌

Story first published: Thursday, May 30, 2019, 16:36 [IST]
Other articles published on May 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X