న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

3rd ODI: పాల్ కోలింగ్‌వుడ్ రికార్డు బద్దలు కొట్టిన ఇయాన్ మోర్గాన్

England vs Pakistan, 3rd ODI: Eoin Morgan to surpass Paul Collingwood as Englands most-capped player

హైదరాబాద్: ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గన్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ జట్టు తరఫున అత్యధిక వన్డే మ్యాచ్‌లాడిన క్రికెటర్‌గా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. పాకిస్థాన్‌తో మంగళవారం ప్రారంభమైన మూడో వన్డేతో ఇయాన్ మోర్గాన్ ఈ ఘనత సాధించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

2009లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేసిన మోర్గన్ ఇప్పటివరకు 198 వన్డేలు ఆడాడు. ఈ జాబితాలో ఇయాన్ మోర్గన్ తర్వాత పాల్ కొలింగ్‌వుడ్(197 వన్డేలు) ఉన్నాడు. 2001 నుంచి 2011 వరకూ పాల్ 197 వన్డేలు ఆడాడు. ఆ తర్వాతి స్థానంలో 194 వన్డేలతో జేమ్స్ ఆండర్సన్ ఉన్నాడు.

32 ఏళ్ల మోర్గాన్ వన్డేల్లో ఇంగ్లాండ్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. మోర్గాన్ ఇప్పటివరకు వన్డేల్లో 39.87 యావరేజితో 6140 పరుగులు చేశాడు. మోర్గాన్ కెప్టెన్సీలోనే ఇంగ్లాండ్ వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంకుని సైతం సొంత చేసుకుంది.

ఇంగ్లాండ తరుపున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో మోర్గాన్(11) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో టెస్టు కెప్టెన్ జో రూట్(14) అగ్రస్థానంలో ఉండగా... మార్కస్ ట్రెస్కోథిక్(12) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం పాకిస్థాన్‌తో జరుగుతున్న సిరిస్‌లో ఇంగ్లాండ్ 2-0 ఆధిక్యంలో ఉంది.

Story first published: Tuesday, May 14, 2019, 19:17 [IST]
Other articles published on May 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X