న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఫైనల్: టాస్‌ కీలకం, విజేతగా ఎవరు నిలిచినా చరిత్రే!

England vs New Zealand, World Cup 2019 final: Stats reveal what captains must do after winning the toss at Lord’s

హైదరాబాద్: ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో మరికొన్ని గంటల్లో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు తెరలేవనుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్‌తో న్యూజిలాండ్ తలపడనుంది. ఈ ప్రపంచకప్‌ లీగ్‌ దశలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్‌దే పైచేయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లిష్‌ జట్టు 119 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ప్రపంచకప్‌లో ఇరు జట్లు తొమ్మిది సార్లు తలపడ్డాయి. ఇందులో ఐదుసార్లు న్యూజిలాండ్‌ గెలవగా, నాలుగు సార్లు ఇంగ్లాండ్ ఛాంపియన్‌గా అవతరించింది. 1992 తర్వాత మళ్లీ ఫైనల్‌కు చేరడం ఇంగ్లాండ్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం. కాగా, ప్రపంచకప్ చరిత్రలో లార్డ్స్‌ క్రికెట్ గ్రౌండ్‌ ఐదోసారి ఫైనల్స్‌కు ఆతిథ్యమివ్వబోతోంది.

England vs New Zealand, World Cup 2019 final: Stats reveal what captains must do after winning the toss at Lord’s

అయితే, ఫైనల్లో టాస్‌ కీలకంగా మారనుంది. లార్డ్స్‌ క్రికెట్ గ్రౌండ్‌ 1975, 1979, 1983, 1999 ప్రపంచకప్‌ ఫైనల్స్‌కు వేదికగా నిలిచింది. ఈ నేపథ్యంలో గత ప్రపంచకప్‌ల చరిత్ర ఒకసారి పరిశీలిస్తే.. గత నాలుగు ఫైనల్స్‌లో మూడుసార్లు తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టే విజతగా నిలిచింది. టాస్‌ గెలిచిన ప్రతి జట్టూ ఫైనల్స్‌లో ఓటమిపాలైంది.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ 12వ ఎడిషన్ కావడం విశేషం. ఈ ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన ఇరు జట్లలో ఏ జట్టు గెలిచినా... తొలిసారి విశ్వవిజేతగా నిలిచి చరిత్ర సృష్టిస్తారు.

Story first published: Sunday, July 14, 2019, 14:08 [IST]
Other articles published on Jul 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X