న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లార్డ్స్‌లో ఫైనల్: చరిత్ర సృష్టించేందుకు పరుగు దూరంలో కేన్ విలియమ్సన్

England vs New Zealand, World Cup 2019 final: Kane Williamson one run away from scripting history at Lord’s

హైదరాబాద్: లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న పైనల్స్‌లో కేన్ విలియమ్సన్ ఒక్క పరుగు చేస్తే ఐసీసీ ప్రపంచకప్‌ చరిత్రలో ఒకే టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించనున్నాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ క్రమంలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళ జయవర్ధనే (548; 2007లో)ను అధిగమిస్తాడు. 2007లో శ్రీలంక కెప్టెన్‌ మహేలా జయవర్దనె 11 ఇన్నింగ్స్‌లో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలతో 548 పరుగులు చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, కేన్ విలియమ్సన్‌ ఈ టోర్నీలో ఎనిమిది ఇన్నింగ్స్‌లోనే 548 పరుగులు చేసి అతడితో సమానంగా ఉన్నాడు.

తొలి కెప్టెన్‌గా చరిత్ర

తొలి కెప్టెన్‌గా చరిత్ర

ఇందులో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆసీస్ మాజీ క్రికెట్ దిగ్గజం రికీపాంటింగ్‌ 2007లో తొమ్మిది ఇన్నింగ్స్‌లో 539 పరుగులు చేసి మూడో స్థానంలో కొనసాగుతుండగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 2003లో అత్యధిక సెంచరీలు(3) బాదిన తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

ఇదిలా ఉంటే, లార్డ్స్‌ మైదానంలో జరుగుతున్న పైనల్స్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ప్రపంచకప్‌లో ఇరు జట్లు తొమ్మిది సార్లు తలపడ్డాయి. ఇందులో ఐదుసార్లు న్యూజిలాండ్‌ గెలవగా, నాలుగు సార్లు ఇంగ్లాండ్ విజేతగా అవతరించింది. ఇరు జట్లు ఎటువంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతున్నాయి.

1992 తర్వాత మళ్లీ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి

1992 తర్వాత మళ్లీ ఫైనల్‌కు చేరడం ఇంగ్లాండ్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం. కాగా, ప్రపంచకప్ చరిత్రలో లార్డ్స్‌ క్రికెట్ గ్రౌండ్‌ ఐదోసారి ఫైనల్స్‌కు ఆతిథ్యమివ్వబోతోంది. కాగా, ఈ ప్రపంచకప్‌ లీగ్‌ దశలో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్‌దే పైచేయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లిష్‌ జట్టు 119 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

ఎవరు గెలిచినా చరిత్రే

ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ 12వ ఎడిషన్ కావడం విశేషం. ఈ ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన ఇరు జట్లలో ఏ జట్టు గెలిచినా... తొలిసారి విశ్వవిజేతగా నిలిచి చరిత్ర సృష్టిస్తారు. గతంలో ఇంగ్లండ్ మూడుసార్లు (1979, 1987, 1992ల్లో) ఫైనల్ చేరినా.. రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. న్యూజిలాండ్ క్రితంసారి (2015లో) ఆసీస్ చేతిలో ఓడింది.

1
43691

{headtohead_cricket_2_4}

Story first published: Sunday, July 14, 2019, 15:10 [IST]
Other articles published on Jul 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X